Share News

Cheetah VS Crocodile: నీటి లోపల మొసలి.. నీటి ఒడ్డున చిరుత.. తోక పట్టుకుని లాగేయడంతో.. చివరకు..

ABN , Publish Date - Apr 17 , 2025 | 01:04 PM

వేట కోసం నీటిలో పొంచి ఉన్న మొసలికి దాహం తీర్చుకోవడానికి వచ్చిన చిరుత కనిపించింది. నీళ్ల తాగి వెళ్లిపోయే సమయంలో మొసలి సడన్‌గా ఎటాక్ చేసింది. మొసలి దాడితో ఉలిక్కిపడిన చిరుత.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

Cheetah VS Crocodile: నీటి లోపల మొసలి.. నీటి ఒడ్డున చిరుత.. తోక పట్టుకుని లాగేయడంతో.. చివరకు..

నీటిలోని మొసలి వేటకు తిరుగుందడనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొసలి నీటిలో ఉండగా ఎంత పెద్ద జంతువైనా దాన్ని ఓడించడం అసాధ్యం. చివరకు మొసలికి ఆహారమవడం తప్ప చేసేదేమీ ఉండదు. అయితే కొన్నిసార్లు ఇలాంటి సమయాల్లోనూ అద్భుతాలు జరుగుతుంటాయి. చింపేయాల్సిన మొసళ్లు కాస్తా.. చావు దెబ్బ తింటుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నీటిలో ఉన్న మొసలికి చిరుత కంటపడింది. తోక పట్టుకుని లాగేడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వేట కోసం నీటిలో పొంచి ఉన్న మొసలికి (Crocodile) దాహం తీర్చుకోవడానికి వచ్చిన చిరుత కనిపించింది. నీళ్ల తాగి వెళ్లిపోయే సమయంలో మొసలి సడన్‌గా ఎటాక్ చేసింది. మొసలి దాడితో ఉలిక్కిపడిన చిరుత (Cheetah) .. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.

Lovers Viral Video: ఉక్కు తాళం కూడా ఊడి రావాల్సిందే.. ఈ దొంగ ట్రిక్ చూస్తే నోరెళ్లబెడతారు..


ఈ క్రమంలో మొసలి.. చిరుత తోక పట్టేసుకుంది. తోకను గట్టిగా పట్టుకున్న మొసలి.. చిరుతను నీటిలోకి లాగేందుకు ప్రయత్నించింది. అయితే చిరుత దాన్నుంచి విడిపించుకునేందుకు శక్తికొద్దీ ప్రయత్నించింది. ఇలా మొసలి, చిరుత మధ్య చాలా సేపు పోటీ జరిగింది. ఈ క్రమంలో చివరకు చిరుతే పైచేయి సాధించింది. మొసలి నుంచి విడిపించుకుని అక్కడి నుంచి పారిపోయింది. దీంతో మొసలి నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది.

Lovers Viral Video: యువతి పక్కనే రెచ్చిపోయిన ప్రేమికులు.. రైల్వే స్టేషన్‌లో ఏం చేస్తున్నారో చూస్తే షాకవ్వాల్సిందే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చిరుత పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘మొసలికి చుక్కలు చూపించిన చిరుత’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6,200కి పైగా లైక్‌లు, 1.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Jugaad Viral Video: దీని ముందు ఏసీ కూడా దిగదుడుపే.. టేబుల్ ఫ్యాన్‌ను ఎలా మార్చాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2025 | 01:31 PM