Jugaad Viral Video: దీని ముందు ఏసీ కూడా దిగదుడుపే.. టేబుల్ ఫ్యాన్‌ను ఎలా మార్చాడో చూడండి..
ABN , Publish Date - Apr 17 , 2025 | 10:15 AM
సీలింగ్ ఫ్యాన్ పైన వాటర్ బాటిల్ పెట్టి ఏసీ ఎఫెక్ట్ తెస్తుంటే.. మరికొందరు కిటికీకి వాటర్ పైపు తగిలించి, ఇంట్లోకి ఏసీ వచ్చేలా సెట్ చేయడం చూశాం. అయితే తాజాగా, ఓ వ్యక్తి టేబుల్ ఫ్యాన్‌ను ఏసీ యంత్రంగా మార్చిన ప్రయోగం వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు..

ఒక్కొక్కరి ఐడియాలు ఒక్కోలా ఉంటాయి. కొందరు రొటీన్‌గా ఆలోచిస్తూ ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు వెరైటీగా ఆలోచిస్తూ వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండడంతో తక్కువ ఖర్చుతో ఇంట్లో చల్లదనం వచ్చేలా చాలా మంది ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. సీలింగ్ ఫ్యాన్ పైన వాటర్ బాటిల్ పెట్టి ఏసీ ఎఫెక్ట్ తెస్తుంటే.. మరికొందరు కిటికీకి వాటర్ పైపు తగిలించి, ఇంట్లోకి ఏసీ వచ్చేలా సెట్ చేయడం చూశాం. అయితే తాజాగా, ఓ వ్యక్తి టేబుల్ ఫ్యాన్‌ను ఏసీ యంత్రంగా మార్చిన ప్రయోగం వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘దీని ముందు ఏసీ కూడా దిగదుడుపే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన ఇంట్లో టేబుల్ ఫ్యాన్‌తో ఏసీ ఎఫెక్ట్ (AC Effect With Table Fan) తేవాలని ప్రయత్నించాడు. ఇందుకోసం ముందుగా టేబుల్ ఫ్యాన్‌ను తీసుకున్నాడు. దానికి వెనుక కవర్ తొలగించి, వెనుక కట్ చేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తగిలించాడు. దానికి పైపు జాయిట్ చేసి సిద్ధంగా పెట్టుకున్నాడు.
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
ఆ తర్వాత ఓ బాక్సులో ఐస్ ముక్కలను (Ice Cubes) తీసుకున్నాడు. ఆ బాక్స్‌కు ప్లాస్టిక్ పైపు జాయిట్ చేశాడు. ఫైనల్‌గా టేబుల్ ఫ్యాన్ ఆన్ చేయగా ఐస్ బాక్స్‌లోని చల్లదనం మొత్తం ఫ్యాన్ గుండా బయటికి వెదజల్లుతోందన్నమాట. ఇలా ఐస్ ముక్కలు, టేబుల్ ఫ్యాన్‌తో ఏసీని ఏర్పాటు చేశాడు. ఇతడి విచిత్ర ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Bike Jugaad Viral Video: వావ్..! జనరేటర్‌తో సూపర్ బైక్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..
ఈ వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టేబుల్ ఫ్యాన్‌తో ఏసీ ఎఫెక్ట్.. ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘మీరు గొప్ప శాస్త్రవేత్తలా ఉన్నారే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Woman Viral Video: ఒంటరిగా వెళ్తున్న మహిళకు షాకింగ్ అనుభవం.. సడన్‌గా దూసుకొచ్చిన యువకుడు.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..