Woman Viral Video: ఒంటరిగా వెళ్తున్న మహిళకు షాకింగ్ అనుభవం.. సడన్‌గా దూసుకొచ్చిన యువకుడు.. చివరకు..
ABN , Publish Date - Apr 17 , 2025 | 08:57 AM
ఓ మహిళ రాత్రి వేళ రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ వెళ్తుంటుంది. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆమె ఒంటరిగా వెళ్లడాన్ని గమనిస్తూ వస్తున్న ఓ దొంగ.. నిర్మానుష్య ప్రదేశంలో సడన్‌గా ఆమె వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మహిళలకు ఇంట్లో, బయటా రక్షణ లేకుండా పోతోంది. ఎప్పుడు, ఎటువైపు నుంచి ఎవరు వచ్చి దాడులు చేస్తారో తెలీని పరిస్థితి నెలకొంది. ఇక మహిళలు ఒంటరిగా బయటికి వెళ్తే తిరిగి క్షేమంగా ఇంటికి రావడం ప్రశ్నార్థకంగా మారింది. కొందరు లైకింగ వేధింపులకు పాల్పడుతుంటే.. మరికొందరు మెడలో చైన్లు లాక్కుని పారిపోతున్నారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒంటరిగా నడుస్తూ వెళ్తున్న మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. సడన్‌గా దూసుకొచ్చిన యువకుడు.. చివరకు ఏం చేశాడో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ రాత్రి వేళ రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ వెళ్తుంటుంది. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆమె ఒంటరిగా వెళ్లడాన్ని గమనిస్తూ వస్తున్న ఓ దొంగ.. నిర్మానుష్య ప్రదేశంలో సడన్‌గా ఆమె వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు.
Viral Video: ఫ్రిడ్జ్ వాటర్ కదా అని తాగేస్తున్నారా.. ఈ వీడియో చూస్తే వాంతులు చేసుకుంటారు..
వచ్చీ రావడంతోనే ఆమెను బలవంతంగా కిందకు తోసేసి, (Thief steals chain from woman's neck) మెడలో చైన్ లాక్కుని పారిపోతాడు. దొంగ చేసిన పనికి ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో దొంగను పట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మహిళలు బయటికి వెళ్లే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి దొంగలను కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Bike Jugaad Viral Video: వావ్..! జనరేటర్‌తో సూపర్ బైక్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..