Bike Jugaad Viral Video: వావ్..! జనరేటర్‌తో సూపర్ బైక్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Apr 17 , 2025 | 07:51 AM
ఓ వ్యక్తి తన వినూత్నమైన బైకును తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించగా.. చివరకు అతడికి ఓ ఐడియా తట్టింది. ఇంకేముందీ వెంటనే ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు..

బైకులతో వినూత్న ప్రయోగాలను చేసే వారిని తరచూ చూస్తుంటాం. కొందరు బైకును ఆటో రూపంలో మార్చితే.. మరికొందరు అదే బైకును నీళ్ల మోటారుగా మార్చేస్తుంటారు. అలాగే ఇంకొందరైతే ఏకంగా బైకు స్వరూపాన్ని మార్చి సరికొత్త వాహనాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి జనరేటర్, ట్రాక్టర్ టైర్లతో బైకును తయారు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన వినూత్నమైన బైకును (Innovative bike) తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించగా.. చివరకు అతడికి ఓ ఐడియా తట్టింది. ఇంకేముందీ వెంటనే ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. ఇందుకోసం ఓ పాత జనరేటర్‌తో పాటూ ట్రాక్టర్ ముందు టైర్లను కూడా తీసుకున్నాడు. బైకు చక్కాల స్థానంలో ట్రాక్టర్ టైర్లను (Tractor Tires) అమర్చి, మధ్యలో జనరేటర్‌ను (Generator) ఫిట్ చేశాడు.
Viral Video: ఫ్రిడ్జ్ వాటర్ కదా అని తాగేస్తున్నారా.. ఈ వీడియో చూస్తే వాంతులు చేసుకుంటారు..
అలాగే హ్యాండిల్, లైట్లు, సీటు సహా మిగతా విడి భాగాలన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఫైనల్‌గా ఓ సూపర్ బైకును తయారు చేశాడన్నమాట. తన ప్రయోగం ఏమాత్రం పని చేస్తుందో చూడాలని ట్రయల్ రన్‌కు సిద్ధమయ్యాడు. జనరేటర్‌ను ఇనుప హ్యాండిల్ సాయంతో గిరగిరా తిప్పి స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఎంచక్కా అన్ని బైకుల తరహాలో రోడ్డుపై రయ్యిన దూసుకెళ్లాడు. ఈ విచితమైన బైక్.. చిత్రవిచిత్రమైన శబ్ధాలు చేస్తూ రోడ్డుపై వెళ్తుంటే.. అందరి కళ్లూ దీనిపైనే పడ్డాయన్నమాట.
Viral Video: ఫోన్‌తో ఫొటోలు తీసుకుంటున్న వ్యక్తి.. సమీపానికి వెళ్లిన యువతి.. గ్యాలరీలో చూడగా..
ఇలా ఈ వ్యక్తి ట్రాక్టర్ టైర్లు, జనరేటర్ తదితరాలతో విచిత్రమైన బైకును తయారు చేసేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ట్రాక్టర్ టైర్లు, జనరేటర్‌తో బైక్.. ప్రయోగం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 360కి పైగా లైక్‌లు, 30 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..