Watch Video: ఉక్కు తాళం కూడా ఊడి రావాల్సిందే.. ఈ దొంగ ట్రిక్ చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:00 PM
ఓ దొంగ బలమైన తాళాలను కూడా సింపుల్‌గా ఎలా తీస్తాడో చేసి చూపించాడు. ఖరీదైన తాళాన్ని ఎంతో సింపుల్‌గా ఓపెన్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

‘‘ప్రతి దారికీ ఓ అడ్డదారి ఉంటుంది’’.. అన్న చందంగా తయారైంది ప్రస్తుతం దొంగల నిర్వాకం. ఎలాంటి ఇంట్లో అయినా, ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా సులభంగా చోరీలు చేసేస్తున్నారు. కొందరు చోరీలు చేసే విధానం చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటోంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ బలమైన తాళాన్ని కూడా ఎంతో సింపుల్‌గా అన్‌లాక్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ దొంగ ట్రిక్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ దొంగ బలమైన తాళాలను కూడా సింపుల్‌గా ఎలా తీస్తాడో చేసి చూపించాడు. ఖరీదైన తాళాన్ని ఎంతో సింపుల్‌గా ఓపెన్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇందుకోసం ఆ దొంగ ఓ సిరంజిలో (Petrol in syringe) పెట్రోల్ నింపుకొన్నాడు. దాన్ని తాళం రంధ్రంలోకి చొప్పించాడు.
Jugaad Viral Video: దీని ముందు ఏసీ కూడా దిగదుడుపే.. టేబుల్ ఫ్యాన్‌ను ఎలా మార్చాడో చూడండి..
ఇలా తాళం లోపల పెట్రోల్ నింపిన (poured petrol into the lock) తర్వాత దానికి నిప్పు పెట్టేశాడు. దీంతో తాళం లోపల మంటలు అంటుకున్నాయి. ఇలా కొద్ది సేపు మంటలు వెలిగిన తర్వాత.. తాళాన్ని చేత్తో పట్టుకుని లాగడంతో సులభంగా ఊడి వచ్చేసింది. ఇలా ఆ వ్యక్తి పెట్రోల్‌ను ఉపయోగించి, తాళాన్ని ఎంతో సింపుల్‌గా తీసేయడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
Woman Viral Video: ఒంటరిగా వెళ్తున్న మహిళకు షాకింగ్ అనుభవం.. సడన్‌గా దూసుకొచ్చిన యువకుడు.. చివరకు..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ దొంగ ట్రిక్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘దీన్ని చూసి మరికొందరు దొంగలు ఇలాగే చేసే ప్రమాదం ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3.35 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..