Share News

Watch Video: అందుకే ఉన్నన్నాళ్లూ హ్యాపీగా ఉండాలనేది.. ఎందుకంటే మరణం ఇలాక్కూడా రావచ్చు..

ABN , Publish Date - Apr 18 , 2025 | 07:41 AM

ఓ వ్యక్తి చనిపోయిన విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ కంపెనీ గేటు వద్ద కొందరు ఉద్యోగులు అటూ, ఇటూ తిరుగుతున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Watch Video: అందుకే ఉన్నన్నాళ్లూ హ్యాపీగా ఉండాలనేది.. ఎందుకంటే మరణం ఇలాక్కూడా రావచ్చు..

జీవితం అనేది నీటి మీద బుడద వంటిది. ఎప్పుడు పగిలిపోతుందో ఎవరూ చెప్పలేరు. అలాగే మనషి కూడా ఎప్పుడు, ఎలా చనిపోతాడో ఎవరూ ఊహించలేరు. అందుకే ఉన్నన్నాళ్లూ సంతోషంగా జీవించాలని పెద్దలు చెబుతుంటారు. కొన్నిసార్లు కొందరు చనిపోయే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అప్పటిదాకా ఆడుతూ, పాడుతూ తిరుగుతున్న వారు కూడా.. హఠాత్తుగా మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. ఇలాంటి విషాదకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చనిపోయిన విధానం చూసి అంతా అయ్యో పాపం.. ఇలా జరిగేందేంటీ.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చనిపోయిన విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కంపెనీ గేటు వద్ద కొందరు ఉద్యోగులు అటూ, ఇటూ తిరుగుతున్నారు. ఇంతలో వారిలో ఓ ఉద్యోగి అప్పటిదాకా ఎంతో చురుగ్గా కనిపించాడు.

Cheetah VS Crocodile: నీటి లోపల మొసలి.. నీటి ఒడ్డున చిరుత.. తోక పట్టుకుని లాగేయడంతో.. చివరకు..


కంపెనీ గేటు నుంచి బయటికి వెళ్లిన అతను.. మళ్లీ లోపలికి వచ్చి సెక్యూరిటీ గది వద్దకు వెళ్లాడు. అక్కడ నిలబడి ఉండగానే ఒక్కసారిగా (man died of heart attack) వెనక్కు తూలి పడిపోయాడు. అక్కడున్న సెక్యూరిటీ పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. అయినా అతను చలనం లేకుండా పడి ఉన్నాడు. తర్వాత అంతా కలిసి అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Lovers Viral Video: యువతి పక్కనే రెచ్చిపోయిన ప్రేమికులు.. రైల్వే స్టేషన్‌లో ఏం చేస్తున్నారో చూస్తే షాకవ్వాల్సిందే..


పరీక్షించిన వైద్యులు అతను గుండె పోటుతో మరణించినట్లు తెలిపారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం.. ఇలా జరిగేందేంటీ’’.. అంటూ కొందరు, ‘‘ఇది చాలా బాధాకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 2 వేలకు పైగా వీక్షించారు.

Woman Viral Video: ఒంటరిగా వెళ్తున్న మహిళకు షాకింగ్ అనుభవం.. సడన్‌‌గా దూసుకొచ్చిన యువకుడు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 18 , 2025 | 07:41 AM