Share News

Aliens: గ్రహాంతర వాసులు నిజంగానే ఉన్నారా.. శాస్త్రవేత్తలకు దొరికిన ఆధారాలు ఏం చెబుతున్నాయంటే..

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:00 PM

గ్రహాంతర వాసులు ఉన్నారో లేరో తెలీదు గానీ.. ఇందుకు సంబంధించిన ఏ వార్త వెలుగులోకి వచ్చినా దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది. ఇందుకు బలం చేకూర్చేలా అప్పుడప్పుడూ గ్రహాంతర వాసులు సంచరిస్తున్నారంటూ వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి..

Aliens: గ్రహాంతర వాసులు నిజంగానే ఉన్నారా.. శాస్త్రవేత్తలకు దొరికిన ఆధారాలు ఏం చెబుతున్నాయంటే..

గ్రహాంతర వాసులు ఉన్నారో లేరో తెలీదు గానీ.. ఇందుకు సంబంధించిన ఏ వార్త వెలుగులోకి వచ్చినా దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది. ఇందుకు బలం చేకూర్చేలా అప్పుడప్పుడూ గ్రహాంతర వాసులు సంచరిస్తున్నారంటూ వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. అయినా ఇప్పటికీ వీటి గురించి ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లభించలేదు. అయితే తాజాగా, శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భూమికి సుదూర ప్రాంతంలో మరో గ్రహాన్ని కనుగొన్నారు. దీంతో గ్రహాంతర వాసుల ప్రస్తావన మరోసారి వెలుగులోకి వచ్చింది.


మన సౌర వ్యవస్థ వెలుపల భూమికి 124 కాంతి సంవత్సరాల దూరంలో K2-18b అనే ఓ గ్రహం (New Planet) ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని (United Kingdom) కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ఖగోళ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో 2022లో అంతరిక్షంలోకి పంపించిన NASA జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (Telescope) ద్వారా ఈ వివరాలను సేకరించారు. భూమిపై జీవుల ద్వారా మాత్రమే ఉత్పత్తి అయ్యే రెండు సమ్మేళనాల రసాయనాలను ఆ గ్రహంపై గుర్తించారు. దీంతో ఆ గ్రహంపై జీవులు ఉండేందుకు ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Stork Viral Video: వేటాడడంలో దీని తర్వాతే ఎవరైనా.. ఎలుకను ఎలా ఎత్తుకెళ్లిందో చూస్తే..


scientists-discovered-new-p.jpg

ఈ గ్రహం భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్లు (930,000 మైళ్ళు) దూరంలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్ష నౌక అక్కడికి చేరుకోవడానికి కాంతి వేగంతో 124 సంవత్సరాలు ప్రయాణించాల్సి ఉంటుందట. ఆ గ్రహం భూమి కంటే 8.6 రెట్లు బరువుగా ఉండడంతో పాటూ 2.6 రెట్లు పెద్దదిగా ఉంటుందని తెలిసింది. కేంబ్రిడ్జ్ ఖగోళ శాస్త్రవేత్తలు ఈ కొత్త గ్రహానికి సంబంధించిన వాతావరణంలో మీథేన్, కార్బన్ డయాక్సైడ్‌లు ఉన్నట్లు 2023లో కనుగొన్నారు. గ్రహం పరిధిలోని వాతావరణంలో కార్బన్ ఆధారిత అణువులను కనుగొనడం అదే మొదటిసారి అని, కాబట్టి ఇందులో జీవులు మనుగడ సాగించేందుకు అనువైన వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Train Accident Video: ఇలాంటి పని ఎవరూ చేయొద్దు.. రైలుపై యువకుడి వాకింగ్.. చివరకు అతడి పరిస్థితి..


సౌర వ్యవస్థ వెలుపల జీవసంబంధమైన కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని, దీనికి సంబంధించి మొదటిసారి బలమైన ఆధారాలు దొరికాయని కేంబ్రిడ్జ్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నిక్కు మధుసూధన్ గురువారం మీడియాకు తెలిపారు. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ గ్రహంలో మొదటగా సముద్రంతో కప్పబడిన ఉపరితలం, దానిపై హైడ్రోజన్ అధికంగా ఉండే వాతావరణం.. కార్బన్ ఆధారిత అణువుల ఉనికిని తెలుపుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ గ్రహం నీరు కలిగి ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొంటున్నారు. మరోవైపు ఆ గ్రహంపై జీవుల ఉనికి ఉందనడానికి ఈ ఆధారాలు సరిపోవని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంతో మళ్లీ గ్రహాంతర వాసుల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Monkey Funny Video: కోతికి లిప్ టూ లిప్ కిస్ పెట్టాలనుకున్నాడు.. మధ్యలో ఏం జరిగిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 18 , 2025 | 12:42 PM