Watch Viral Video: వేసవిలో తాటి కాయలు తెగ తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే..
ABN , Publish Date - Apr 19 , 2025 | 09:08 AM
ఓ చిరు వ్యాపారి రోడ్డు పక్కన తాటికాయలు విక్రయిస్తున్నాడు. మంచిదే కదా.. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనిపిస్తోంది కదా. కాస్త ఆగండి.. అతను ఎలా విక్రయిస్తున్నాడో కొంచెం తీక్షణంగా చూస్తే ఈ మాట ఎందుకన్నామో మీకు అర్థమవుతుంది..

వేసవి వచ్చిందంటే ఎక్కువగా తినే ఆహార పదార్థాలలో తాటి కాయలు ముందు వరుసలో ఉంటాయి. వేడి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటూ అనేక పోషకాలు అందిస్తుందనే ఉద్దేశంతో ఈ కాయలు తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందటే.. ప్రస్తుత సమాజంలో టీ దగ్గర నుంచి బిరియాని వరకూ, ఆకుకూరల దగ్గర నుంచి కూరగాయల వరకూ ప్రతి దాంట్లో కలుషితం లేదా అపరిశుభ్ర వాతావరణంలో విక్రయించడం చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తాటి కాయలు విక్రయించే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిరు వ్యాపారి రోడ్డు పక్కన తాటికాయలు విక్రయిస్తున్నాడు. మంచిదే కదా.. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనిపిస్తోంది కదా. కాస్త ఆగండి.. అతను ఎలా విక్రయిస్తున్నాడో కొంచెం తీక్షణంగా చూస్తే ఈ మాట ఎందుకన్నామో మీకు అర్థమవుతుంది.
రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టిన అతను.. తాటి కాయలన్నింటినీ బాగా కడిగి బండిపై పెడుతున్నాడు. కడగడమంటే మంచి నీటితో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. తాటికాయ గుత్తులను ఒక్కొక్కటిగా రోడ్డు పక్కన ఉండే మురుగు కాలువలో (Trader cleaning an ice apple in sewage water) ముంచి మరీ శుభ్రం చేస్తున్నాడు. మురుగులో ముంచిన తాటికాయలను తర్వాత తాపీగా బండిపై పెడుతున్నాడన్నమాట. ఇతడి నిర్వాకాన్ని గమనించిన అక్కడున్న వారు ఖంగుతిన్నారు.
Monkey Funny Video: కోతికి లిప్ టూ లిప్ కిస్ పెట్టాలనుకున్నాడు.. మధ్యలో ఏం జరిగిందో చూస్తే..
ఈ ఘటనను తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇకపై తాటికాయలను తినాలంటే ఆలోచించాలేమో’’.. అంటూ కొందరు, ‘‘అదే మురుగు నీటిని ఇతడితో తాగించాలి.. అప్పుడే ఇతరుల బాధ అర్థమవుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Stork Viral Video: మైఖేల్ జాక్సన్ ఫాలో అవుతున్న కొంగ.. ఎలా నీళ్లు తాగుతుందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..