Share News

Woman Viral Video: బురఖా మహిళపై అనుమానం.. లోపల పరిశీలించగా దిమ్మతిరిగే సీన్..

ABN , Publish Date - Apr 19 , 2025 | 10:54 AM

మహిళ బురఖా ధరించి రావడం చూసి పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో మహిళా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పరిశీలించారు. చివరకు ఆమె నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు.

Woman Viral Video: బురఖా మహిళపై అనుమానం.. లోపల పరిశీలించగా దిమ్మతిరిగే సీన్..

ప్రస్తుతం మహిళలు కూడా పురుషులతో సమానంగా నేరాలకు పాల్పడుతున్నారు. పైకి అమాయకంగా కనిపిస్తూ కొందరు, హుందాగా కనిపిస్తూ మరికొందరు.. వివిధ రకాల చోరీలకు పాల్పడుండడం చూస్తున్నాం. దర్జాగా దుకాణంలోకి వచ్చి చీరలను కాళ్ల కింద పెట్టుకుని మాయమయ్యే మహిళలను చూశాం.. చివరకు శరీర భాగాల్లో బంగారు, డ్రగ్స్ తదితరాలను పెట్టుకుని దేశాలు దాటే వారిని కూడా చూశాం. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ బురఖా ధరించిన మహిళ నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్‌ (Bihar) కతిహార్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది మద్యాన్ని వివిధ మార్గాల ద్వారా అక్రమంగా తరలిస్తూ పట్టుబడడం చూస్తున్నాం.

Stork Viral Video: మైఖేల్ జాక్సన్ ఫాలో అవుతున్న కొంగ.. ఎలా నీళ్లు తాగుతుందో చూస్తే..


కొందరు పోలీసులకూ అనుమానం రాకుండా మందు బాటిళ్లను తరలించడం చూస్తున్నాం. తాజాగా, ఓ మహిళ బురఖా ధరించి రావడం చూసి (woman carrying alcohol packets in burqa) పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో మహిళా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పరిశీలించారు. బురఖాలో పరిశీలించగా నడుము చుట్టు నల్లటి ప్లాస్టర్ చుట్టేసి ఉంది. అందులో టెట్రా మద్యం ప్యాకెట్లు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఎవరకీ అనుమానం రాకుండా ఎంతో పకడ్బందీగా మద్యం ప్యాకెట్లను నడుముకు చుట్టుకోవడం చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఆ బ్యాండేజీలను తొలగించడానికి వారు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది.

Watch Viral Video: వేసవిలో తాటి కాయలు తెగ తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈమె తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘మద్యాన్ని ఇలాక్కూడా తరలించవచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2025 | 10:54 AM