Share News

Monkeys War Viral Video: గ్రూపు గొడవలు వీటికీ తప్పలేదుగా.. కోతులన్నీ ఎలా కొట్టుకుంటున్నాయో చూడండి..

ABN , Publish Date - Apr 20 , 2025 | 07:30 AM

కారణం ఏంటో తెలీదు గానీ.. రెండు కోతుల గ్రూపుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఓ ఏరియా కోతులన్నీ కలిసి రోడ్డు పక్కన ఓ వైపు మోహరించగా.. మరో ఏరియాకు చెందిన కోతులన్నీ వాటికి ఎదురుగా వచ్చి చేరాయి. ఇంకేముందీ..

Monkeys War Viral Video: గ్రూపు గొడవలు వీటికీ తప్పలేదుగా.. కోతులన్నీ ఎలా కొట్టుకుంటున్నాయో చూడండి..

మనుషుల మధ్య గ్రూప్ వార్ జరగడం సర్వసాధారణం. తరచూ ఎక్కడో చోట ఏదో ఒక గ్రూపు వారు మరో గ్రూపు వారిపై దాడులు చేయడం, దానికి ప్రతీకారంగా బాధిత గ్రూపు వారు మళ్లీ టార్గెట్ చేయడం చూస్తుంటాం. అయితే ఇలాంటి గ్రూపు కొట్లాటలు జంతువుల మధ్య కూడా జరుగుతుంటాయా అంటే.. అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా జంతువులు గ్రూపులుగా విడిపోయి దాడి చేసుకోవడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వీడియోలన్నీ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కోతుల కొట్లాటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘గ్రూపు గొడవలు వీటికీ తప్పలేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కారణం ఏంటో తెలీదు గానీ.. రెండు కోతుల గ్రూపుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఓ ఏరియా కోతులన్నీ కలిసి రోడ్డు పక్కన ఓ వైపు మోహరించగా.. మరో ఏరియాకు చెందిన కోతులన్నీ వాటికి ఎదురుగా వచ్చి చేరాయి. ఇంకేముందీ.. ఈ ఏరియా మాదంటే.. మాదంటూ వాదించకున్నాయి. ఈ క్రమంలో కొన్ని కోతులకు సహనం నశించి.. (War between monkey groups) శత్రుమూకల మీదకు దాడికి దిగాయి. దీంతో అవతలి గ్రూపు కోతులు కూడా ఏమాత్రం తగ్గకుండా ఎదురుదాడికి దిగాయి.

Optical illusion: మీలోని తీక్షణా శక్తికి సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న StORM అనే పదాలను 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..


ఈ కోతుల యుద్ధం ఎఫెక్ట్ తెలిసేలా.. ఆ ప్రాంతం మొత్తం దుమ్ము లేచిపోయింది. ఇలా ఆ రెండు కోతుల గ్రూపులు చాలా సేపు కొట్లాడుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ గ్రూపు మరో గ్రూపును కొంచెం దూరం వెంబడించి పైచేయి సాధించాయి. ఇంతలో ఆ గ్రూపు కోతులు కూడా వాటిని మళ్లీ దూరంగా తరిమికొట్టాయి. దూరం నుంచి చూసేవారికి కోతుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్నట్లు కనిపించింది.

Marriage funny video: దండ వేయించుకోని వరుడికి దడ పుట్టించిందిగా.. ఎలా భయపెట్టిందో చూస్తే..


కొందరు తమ వాహనాలను ఆపుకొని మరీ ఈ కొట్లాటను తిలకించారు. మరికొందరు వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కోతుల మధ్య కొట్లాట మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఏరియాలు పంచుకోవడంలో సమస్య వచ్చిందేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 వేలకు పైగా లైక్‌లు, 2.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Watch Viral Video: వేసవిలో తాటి కాయలు తెగ తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2025 | 07:31 AM