Funny Viral Video: ఇదేం వింత పరీక్షరా నాయనా.. వాషింగ్ మెషిన్‌లో రాయి వేయడంతో.. చివరకు..
ABN , Publish Date - Apr 20 , 2025 | 09:22 AM
ఓ వ్యక్తి వాషింగ్ మెషిన్‌కు వింత పరీక్ష పెట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు. వాషింగ్ మెషిన్‌ను ఆన్ చేసిన అతను.. కాసేపటి తర్వాత అందులో ఓ పెద్ద రాయి వేసి మూత మూశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ఏదైనా వస్తువు కొన్నప్పుడు దాని పనితనం ఎలా ఉందో అని పరీక్షించడం సర్వసాధారణం. అయితే కొందరు వస్తువులను చిత్రవిచిత్ర పద్ధతుల్లో పరీక్షించడం, ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనుకున్నది ఒకటి, చివరకు అయ్యిందొకటి.. అన్న చందంగా తయారవుతుంటుంది. ఈ తరహా తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వాషింగ్ మెషిన్‌ను పరీక్షించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇదేం వింత పరీక్షరా నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వాషింగ్ మెషిన్‌కు వింత పరీక్ష పెట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు. వాషింగ్ మెషిన్‌ను ఆన్ చేసిన అతను.. కాసేపటి తర్వాత అందులో (Man threw stone in washing machine) ఓ పెద్ద రాయి వేసి మూత మూశాడు.
Marriage funny video: దండ వేయించుకోని వరుడికి దడ పుట్టించిందిగా.. ఎలా భయపెట్టిందో చూస్తే..
రాయి వేయగానే అప్పటిదాకా సవ్యంగా తిరుగుతున్న వాషింగ్ మెషిన్.. రాయి వేయగానే మరింత షేక్ అవుతూ అటూ, ఇటూ జరుగుతుంటుంది. చూస్తుండగానే వాషింగ్ మెషిన్ పైన ఉండే రేకులన్నీ ఊడిపోయాయి. చివరకు వాషింగ్ మెషిన్ మధ్యలోని గుండ్రంగా తిరిగే యంత్రం ఊడి పక్కకు వస్తుంది. అప్పటికీ ఆ మిషిన్ తిరుగుతూనే ఉంటుంది.
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ఇలా వాషింగ్ మిషిన్‌లో రాయి వేసి, దానికి వింత పరీక్ష పెట్టిన ఈ వ్యక్తిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వాషింగ్ మిషిన్ మోస్ట్ పవర్‌ఫుల్’’.. అంటూ కొందరు, ‘‘పరీక్షలో వాషింగ్ మెషిన్ పాస్ అయినట్లే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 39 వేలకు పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Monkeys War Viral Video: గ్రూపు గొడవలు వీటికీ తప్పలేదుగా.. కోతులన్నీ ఎలా కొట్టుకుంటున్నాయో చూడండి..
ఇవి కూడా చదవండి..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..