Share News

Sheep Funny Viral Video: కర్మ కమ్ బ్యాక్ అంటే ఇదేనేమో.. ఈ పొట్టేలు చేసిన పని చూస్తే..

ABN , Publish Date - Apr 20 , 2025 | 10:02 AM

ఓ కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో జనమంతా గుమికూడి ఉంటారు. అక్కడే ఓ చెట్టుకు పొట్టేలును కట్టేసి ఉంటారు. ఇంతలో ఓ అమకుల్ అక్కడికి వెళ్లి పొట్టేలిని చేత్తొ గట్టిగా కొడతాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది.

Sheep Funny Viral Video: కర్మ కమ్ బ్యాక్ అంటే ఇదేనేమో.. ఈ పొట్టేలు చేసిన పని చూస్తే..

కొందరు ఎదుటి వారిని ఏదో రకంగా హింసించాలని చూస్తుంటారు. అయితే అందుకు తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని మాత్రం గ్రహించరు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు వెంటనే గుణపాఠాలు నేర్చుకుంటుంటారు. ముఖ్యంగా జంతువులను హింసించే సమయాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి పొట్టేలు ఇచ్చిన ఝలక్ చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కర్మ.. కమ్ బ్యాక్.. అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో జనమంతా గుమికూడి ఉంటారు. అక్కడే ఓ చెట్టుకు పొట్టేలును కట్టేసి ఉంటారు. ఇంతలో ఓ అమకుల్ అక్కడికి వెళ్లి పొట్టేలిని చేత్తొ గట్టిగా కొడతాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది.

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


అంకుల్ కొట్టడంతో తీవ్రంగా హట్ అయిన పొట్టేలు కాసేపు మౌనంగా ఉండిపోతుంది. అతను అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోవడం చూసి .. (Sheep hit the uncle) అతడి వెనుకే వెళ్లి బలంగా ఢీకొడుతుంది. దెబ్బకు అతను బొక్కబోర్లాపడిపోతాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా తెగ నవ్వుకుంటారు. కాగా, ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Funny Viral Video: ఇదేం వింత పరీక్షరా నాయనా.. వాషింగ్ మెషిన్‌లో రాయి వేయడంతో.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కర్మ ఎవరినీ వదలంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘పొట్టేలు రివేంజ్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లు, 1.61 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Monkeys War Viral Video: గ్రూపు గొడవలు వీటికీ తప్పలేదుగా.. కోతులన్నీ ఎలా కొట్టుకుంటున్నాయో చూడండి..


ఇవి కూడా చదవండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2025 | 10:02 AM