Puzzle: లెక్కల్లో మీరు జీనియస్ అయితే.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి చూద్దాం..
ABN , Publish Date - Apr 21 , 2025 | 08:38 PM
ఓ రైతు తన పొలంలో 3 గుర్రాలు, 2 బాతులు, 1 పందిని పెంచుతున్నాడు. అయితే ఈ పొలంలో ప్రస్తుతం ఎన్ని అడుగులు ఉన్నాయనేది పజిల్. ఇంకెందుకు ఆలస్యం ఈ పజిల్‌కు సమాధానం ఏంటో చెప్పండి చూద్దాం..

సోషల్ మీడియాలో మెదడుకు పరీక్ష పెట్టే అనేక సాధనాలు అందుబాటులో ఉంటాయి.అయితే వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్స్ అందరినీ తెగ ఆకట్టుకుంటుంటాయి. ఎందుకంటే ఈ పజిల్స్ ఎంతో లాజిక్‌గా ఉంటూ సమాధానాలు తెలుసుకునేందుకు బుర్రకు పని చెప్పాల్సి ఉంటుంది. తద్వారా మన మెదడు మరింత షార్ప్ అవుతుందన్నమాట. ఇందుకోసం ప్రస్తుతం మీ ముందుకు ఓ పజిల్ తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న పజిల్‌ను పరిష్కరిస్తే.. మీరు లెక్కల్లో జీనియస్ అని అర్థం..
సోషల్ మీడియాలో ఓ పజిల్ (Viral puzzle) తెగ వైరల్ అవుతోంది. ఈ పజిల్ సారాంశం ఏంటంటే.. ఓ రైతు (Farmer) తన పొలంలో 3 గుర్రాలు, 2 బాతులు, 1 పందిని పెంచుతున్నాడు. అయితే ఈ పొలంలో ప్రస్తుతం ఎన్ని అడుగులు (How many feet are there in farmer's field) ఉన్నాయనేది పజిల్. ఇందులో పజిల్ ఏముందీ.. అని అనుకుంటున్నారా.
మీలాగే చాలామంది అలాగే అనుకుని టక్కున సమాధానం చెబుతున్నారు. అయితే చాలా మంది అనుకున్న సమాధానం కరెక్ట్ కాదు. సాధారణంగా ఒక గుర్రానికి 4 కాళ్లు.. అంటే 3 గుర్రాలకు కలిపి 12 అవుతాయి. అలాగే 1 బాతుకు రెండు కాళ్లు, 1 పందికి 4 నాలుగు కాళ్లు ఉంటాయి. అంటే 20 అడుగులు ఉంటాయనేది అంతా చెప్పే సమాధానం. అయితే ఇది మీరు అనుకుంటున్నట్లు సరైన సమాధానం కాదు. సరైన సమాధానం కోసం మీకు కొంత సమయం ఇస్తున్నాం.. ఆలోచించండి..
.
.
.
.
.
.
.
.
ఏంటీ ఇప్పటికీ మీకు సరైన సమాధానం రాలేదా. దీనికి సరైన సమాధానం 22. ఎందుకంటే ఈ పొలంలో 3 గుర్రాలు, 1 బాతు, 1 పందితో పాటూ రైతు కూడా ఉన్నాడు కదా. అంటే ఆ పొలంలో అన్నీ కలిపితే మొతం 22 అడుగులు ఉన్నాయన్నమాట. ఈ సమాధానాన్ని ముందే ఊహించిన వారంతా లెక్కల్లో జీనియస్‌లు అని అర్థం.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..