Viral Video: సమయస్ఫూర్తి అంటే ఇదేనేమో.. కోపంగా దగ్గరికొచ్చిన బైకర్‌ను.. ఎలా కూల్ చేశాడో చూస్తే..
ABN , Publish Date - Apr 21 , 2025 | 06:22 PM
ఓ యువకుడు బైకుపై వస్తుండగా.. అదే సమయంలో మరో వ్యక్తి బైకుపై సైడు నుంచి రోడ్డుపైకి వచ్చేస్తాడు. ఈ క్రమంలో రెండు బైకులూ ఢీకొని ఓ వ్యక్తి కిందపడిపోతాడు. కిందపడ్డ వ్యక్తి కోపంగా యువకుడి వద్దకు వెళ్తాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు కొట్టుకునే వరకూ వెళ్లే గొడవలు కూడా సింపుల్‌గా పరిష్కారమవుతుంటాయి. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి కొందరు ఎంతో తెలివిగా వ్యవహరించడం చూస్తుంటాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దాడి చేయడానికి వచ్చిన ఓ బైకర్‌ను ఓ యువకుడు కూల్ చేసేశాడు. అతను వ్యవహరించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘సమయస్ఫూర్తి అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. ఓ యువకుడు బైకుపై వస్తుండగా.. అదే సమయంలో మరో వ్యక్తి బైకుపై సైడు నుంచి రోడ్డుపైకి వచ్చేస్తాడు. ఈ క్రమంలో (Bikes collided) రెండు బైకులూ ఢీకొని ఓ వ్యక్తి కిందపడిపోతాడు. కిందపడ్డ వ్యక్తి కోపంగా యువకుడి వద్దకు వెళ్తాడు. రాంగ్ రూట్‌లో వచ్చి బైకును ఢీకొంటావా.. అంటూ అతడిపై సీరియస్ అవుతాడు. దాదాపు కొట్టేంత ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
Viral Video: బ్రెయిన్‌కు పనిపెట్టడమంటే ఇదేనేమో.. ఐరన్ బాక్స్‌ను ఎలా వాడుతున్నాడంటే..
ఈ క్రమంలో తీరా దగ్గరికి వెళ్లగానే ఆ యువకుడు తన జేబులో నుంచి సిగరెట్ తీసి, (man put cigarette in biker's mouth) ఆ వ్యక్తి నోట్లో పెడతాడు. తర్వాత తన నోట్లో కూడా ఓ సిగరెట్ పెట్టుకుంటాడు. ఆ తర్వాత లైటర్‌తో అతడి సిగరెట్ వెలిగిస్తాడు. సిగరెట్ వెలిగించిన మరుక్షణంలోనే ఆ వ్యక్తి కోపం మొత్తం ఆవిరైపోతుంది. ‘‘సర్లే బ్రదర్.. ఇలాంటివన్నీ మామూలే.. వస్తా’’.. అంటూ అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోతాడు. ఇలా పెద్ద గొడవను కాస్తా చిన్న సిగరెట్‌తో పరిష్కరించిన ఈ యువకుడి తెలివి చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది స్కిప్టెడ్ అని తెలిసిపోతున్నా కూడా.. కామెడీ చాలా బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘గొడవను ఆపిన సిగరెట్.. ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2,300కి పైగా లైక్‌లు, 95 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Funny Viral Video: బ్యాచిలర్స్ అంటే ఈమాత్రం ఉండాలి మరి.. బీరు బాటిల్‌ను ఎలా వాడేశాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..