Funny Viral Video: బ్యాచిలర్స్ అంటే ఈమాత్రం ఉండాలి మరి.. బీరు బాటిల్‌ను ఎలా వాడేశాడో చూస్తే..
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:42 PM
ఓ బ్యాచిలర్స్ గదిలో యువకుడ చేసిన నిర్వాకం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. సదరు యువకుడు చపాతీలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇతను చపాతీలు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘బ్యాచిలర్స్ అంటే ఈమాత్రం ఉండాలి మరి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

బ్యాచిలర్స్ రూం అంటేనే చిందరవందరగా పడిపోయిన వస్తువులు, కంపుగొట్టే కిచెన్ గుర్తుకొస్తుంటుంది. ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకునే వారు ఎప్పుడు తింటారో, ఎప్పుడు పడుకుంటారో తెలీని పరిస్థితి. ఇక వంట విషయానికొస్తే ఏ ఆహార పదార్థాలతో ఏ వంట చేస్తారో వారికే తెలీని పరిస్థితి. మొత్తానికి బ్యాచిలర్స్ కష్టాలు చూపరులకు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు బీరు బాటిల్‌ను ఉపయోగించిన తీరు చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘బ్యాచిలర్స్ అంటే ఈమాత్రం ఉండాలి మరి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బ్యాచిలర్స్ గదిలో (Bachelor's room) యువకుడ చేసిన నిర్వాకం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. సదరు యువకుడు చపాతీలు (man making chapatis) చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం చపాతీ పిండిని కలుపుకొని సిద్ధంగా ఉంచుకున్నాడు.
Sheep Funny Viral Video: కర్మ కమ్ బ్యాక్ అంటే ఇదేనేమో.. ఈ పొట్టేలు చేసిన పని చూస్తే..
గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పెనాన్ని వేడి కూడా చేశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. పిండఉండలను రుద్దేందుకు వాడే చపాతీ కర్ర గదిలో కనిపించలేదు. అయినా తన కార్యక్రమాన్ని ఆపడం ఇష్టం లేక.. చివరకు తన బుర్రకు పని చెప్పాడు. రాత్రి తాగి పడేసిన బీరు బాటిళ్లను చూడగానే తన బుర్రలో చటుక్కున బల్బ్ వెలిగింది.
Viral Video: బ్రెయిన్‌కు పనిపెట్టడమంటే ఇదేనేమో.. ఐరన్ బాక్స్‌ను ఎలా వాడుతున్నాడంటే..
ఇంకేముందీ ఆ బాటిల్ తీసుకుని, దాంతోనే చపాతీ ఉండలను (Rolling chapatis with beer bottle) రోలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా బీరు బాటిల్‌తో చకచకా చపాతీలను చేసేసి అంతా అవాక్కయ్యేలా చేశాడు. అతని స్నేహితుడు ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 18 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..