Ice cream Viral Video: ఐస్‌క్రీమ్ కదా అని జుర్రేస్తున్నారా.. అయితే ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాకవుతారు..
ABN , Publish Date - Apr 21 , 2025 | 09:11 PM
ఓ వ్యక్తి కుల్ఫీ ఐస్ క్రీమ్ కొనుక్కుని, దాన్ని తినేందుకు సిద్ధమవుతాడు. అయితే కొంత తినగానే అతడికి ఎందుకో అనుమానం కలుగుతుంది. ఐస్‌క్రీం మధ్యలో ఏదో వస్తువు ఉందన్న అనుమానం కలుగుతుంది. చివరకు తీసి చూడగా దిమ్మతిరిగే సీన్ కనిపిస్తుంది. .

ఆహార పదార్థాలలో కల్తీ చేయడం, అపరిశుభ్రమైన ప్రదేశంలో వంట చేయడం వంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చూస్తుంటాం. కూరగాయలను మురుగు నీటిలో ముంచుతూ కొందరు, చపాతీపై ఉమ్మి వేస్తూ మరికొందరు, ఇంకొందరైతే ఏకంగా తినుబండారాలపై మూత్రం పోస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ షాకింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఐస్ క్రీమ్ తినే ముందు దాని లోపల పరిశీలించిన వ్యక్తికి దిమ్మ తిరిగే సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో.. నాలుక కోసే ఐస్‌క్రీమ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కుల్ఫీ ఐస్ క్రీమ్ (Ice cream) కొనుక్కుని, దాన్ని తినేందుకు సిద్ధమవుతాడు. అయితే కొంత తినగానే అతడికి ఎందుకో అనుమానం కలుగుతుంది. ఐస్‌క్రీం మధ్యలో ఏదో వస్తువు ఉందన్న అనుమానం కలుగుతుంది.
Viral Video: సమయస్ఫూర్తి అంటే ఇదేనేమో.. కోపంగా దగ్గరికొచ్చిన బైకర్‌ను.. ఎలా కూల్ చేశాడో చూస్తే..
అనుమానం రావడంతో బయటికి తీసి, అందులో ఏముందా అని చేత్తో తీసి చూస్తాడు. ఇంకేముందీ.. లోపల నుంచి ఏకంగా (Blade in middle of ice cream) ఓ బ్లేడు బయటికి వస్తుంది. దాన్ని చూడగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. పొరపాటున పిల్లలు తిని ఉంటే వారి పరిస్థితి ఏంటని.. అతను షాపు యజమానిని నిలదీస్తాడు. ఐస్‌క్రీమ్ మధ్యలో బ్లేడును చూడగానే.. షాపు యజమాని తనకేం తెలీదు అన్నట్లుగా బిక్కమొఖం వేస్తాడు.
Puzzle: లెక్కల్లో మీరు జీనియస్ అయితే.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి చూద్దాం..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నాలుక కోసే ఐస్‌క్రీమ్ అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఐస్ మధ్యలో బ్లేడు కనిపించడం ఇదే మొదటిసారి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 66 వేలకు పైగా లైక్‌లు, 3.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..