Share News

Viral Video: మంచి పని చేస్తే.. అంతా మంచే జరుగుతుంది.. ఇతడికేమైందో చూడండి..

ABN , Publish Date - Apr 23 , 2025 | 06:18 PM

ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉండగా.. కాస్త దూరంలో నడిరోడ్డుపై మ్యాన్‌హోల్ తెరచి ఉంటుంది. అదే సమయంలో ఓ యువతి స్కూటీపై వేగంగా వచ్చి.. మ్యాన్‌హోల్ వద్దకు రాగానే సడన్‌గా ఆగుతుంది. తర్వాత ఆ వ్యక్తి చేసిన మంచి పనితో చివరకు ఏం జరిగిందో చూడండి..

Viral Video: మంచి పని చేస్తే.. అంతా మంచే జరుగుతుంది.. ఇతడికేమైందో చూడండి..

కర్మ ఫలం వెంటాడుతుంది.. అనేది పెద్దలు అంటుంటారు. మంచి చేసిన వారికి మంచే జరగుతుంది, అలాగే చెడు చేసిన వారికి కూడా చెడు జరుగుతుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మంచి పని చేసిన ఓ వ్యక్తి.. చివరకు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘మంచి పని చేస్తే.. అంతా మంచే జరుగుతుంది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉండగా.. కాస్త దూరంలో నడిరోడ్డుపై మ్యాన్‌హోల్ (Manhole) తెరచి ఉంటుంది. అదే సమయంలో ఓ యువతి స్కూటీపై వేగంగా వచ్చి.. మ్యాన్‌హోల్ వద్దకు రాగానే సడన్‌గా ఆగుతుంది. ఆ తర్వాత మ్యాన్‌హోల్ పక్క నుంచి వెళ్లిపోతుంది.

Viral Video: సమయస్ఫూర్తి అంటే ఇదేనేమో.. కోపంగా దగ్గరికొచ్చిన బైకర్‌ను.. ఎలా కూల్ చేశాడో చూస్తే..


రోడ్డు పక్కన ఉన్న వ్యక్తి ఇదంతా గమనిస్తుంటాడు. మ్యాన్‌హోల్ కారణంగా ఎవరూ ప్రమాదానికి గురి కావొద్దనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లి, మూతను సక్రమంగా మూసేస్తాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. అతను రోడ్డు మధ్యలోకి వెళ్లగానే.. అంతవరకూ నిలబడి ఉన్న ప్రాంతంలో విద్యుత్ స్తంభం (Electric pole has fallen) కూలిపడిపోతుంది. అతను అక్కడే ఉండి ఉంటే పెద్ద ప్రమాదం జరిగిఉండేది.

Funny Viral Video: బ్యాచిలర్స్ అంటే ఈమాత్రం ఉండాలి మరి.. బీరు బాటిల్‌ను ఎలా వాడేశాడో చూస్తే..


అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో మంచి పని చేసేందుకు వెళ్లి.. పెద్ద ప్రమాదం నుంచి బయటపట్డాడన్నమాట. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మంచి చేస్తే అంతా మంచే జరుగుతుంది.. అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘అతడి మంచితనమే ప్రాణాలను కాపాడింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 6 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: మీ వీధులు సల్లగుండ.. ఎండ వేడి తగలకుండా వీళ్లు చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2025 | 06:18 PM