Share News

Viral Video: తయారీదారులకే షాక్ ఇచ్చాడుగా.. లామినేషన్ మిషన్‌ను ఎలా వాడారంటే..

ABN , Publish Date - Apr 23 , 2025 | 07:22 PM

సాధాణంగా లామినేషన్ మిషిన్‌తో పేపర్లపై ప్లాస్టిక్ పేపర్లను అతికించి, అవి చిరిగిపోకుండా దృఢంగా తయారు చేసేందుకు వాడుతుంటారు. అయితే ఓ వ్యక్తి ఈ మిషిన్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: తయారీదారులకే షాక్ ఇచ్చాడుగా.. లామినేషన్ మిషన్‌ను ఎలా వాడారంటే..

కొందరు వస్తువులును వాడే పద్ధతి చూస్తే తయారీదారులే షాక్ అయ్యేలా ఉంటుంది. అంతా ఐరన్ బాక్స్‌ను దుస్తులు ఇస్త్రీ చేసేందుకు వాడితే.. కొందరు దాన్ని వంట చేసేందుకు వాడుతుంటారు. అలాగే అంతా గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తే.. ఓ వ్యక్తి మాత్రం దాన్ని బాత్రూం షవర్‌లా వాడేస్తాడు. అదేవిధంగా డ్రోన్‌ కెమెరాను అంతా వీడియోలు తీయడానికి వాడితే.. ఓ వ్యక్తి మాత్రం దాన్ని మామిడికాయలు కోసేందుకు వాడతాడు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి లామినేషన్ మిషన్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధాణంగా లామినేషన్ మిషిన్‌తో (Lamination machine) పేపర్లపై ప్లాస్టిక్ పేపర్లను అతికించి, అవి చిరిగిపోకుండా దృఢంగా తయారు చేసేందుకు వాడుతుంటారు. అయితే ఓ వ్యక్తి ఈ మిషిన్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Hippopotamus VS Crocodile: నీటి ఏనుగు పవర్ మామూలుగా లేదుగా.. మొసలిని ఎలా భయపెట్టిందో చూస్తే..


దోసెలు వేసేందుకు ఎవరైనా పెనాన్ని ఉపయోగిస్తారు. అయితే ఇతను మాత్రం పెనానికి (Man making dosas with the help of lamination machine) బదులుగా లామినేషన్ మిషిన్‌ను వాడేశాడు. మిషిన్‌కు ఓ వైపు దోసె పిండివేయగా.. అవతలి వైపు గుండ్రటి దోసెలు బయటికి వస్తున్నాయి. ఇలా పిండి వేయగానే.. అలా దోసెలన్నీ చుట్టలు చుట్టలుగా వచ్చేస్తున్నాయన్నమాట. ఈ వ్యక్తి విచిత్రమైన తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: మంచి పని చేస్తే.. అంతా మంచే జరుగుతుంది.. ఇతడికేమైందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇండియా టెక్నాలజీనా మజాకా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 వేలకు పైగా లైక్‌‌లు, 1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: మీ వీధులు సల్లగుండ.. ఎండ వేడి తగలకుండా వీళ్లు చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2025 | 08:06 PM