Doctor Funny Video: కుట్లు వేయడమే కాదు చెప్పులు కుట్టడమూ తెలుసు.. ఆపరేషన్ థియేటర్‌లో ఈ డాక్టర్ నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Apr 24 , 2025 | 06:56 PM
ఆస్పత్రుల్లో కొన్నిసార్లు వైద్యులు, మరికొన్నిసార్లు రోగులు చిత్రవిచిత్రగా ప్రవర్తించడం చూస్తుంటాం. డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటే.. మరోవైపు రోగి ఖైనీ వేసుకోవడం చూశాం. అలాగే ఆపరేషన్ థియేటర్ ఫోన్లు చూసుకుంటూ టైప్ పాస్ చేసే వైద్యులనూ చూశాం. ఇలాంటి..

ఆస్పత్రుల్లో కొన్నిసార్లు వైద్యులు, మరికొన్నిసార్లు రోగులు చిత్రవిచిత్రగా ప్రవర్తించడం చూస్తుంటాం. డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటే.. మరోవైపు రోగి ఖైనీ వేసుకోవడం చూశాం. అలాగే ఆపరేషన్ థియేటర్ ఫోన్లు చూసుకుంటూ టైప్ పాస్ చేసే వైద్యులనూ చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వైద్యు విద్యార్థి ఆపరేషన్ థియేటర్ చేస్తున్న పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కుట్లు వేయడమే కాదు చెప్పులు కుట్టడమూ తెలుసు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి ఆపరేషన్ థియేటర్‌లో విధుల్లో ఉన్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. ఆపరేషన్ థియేటర్‌లో ఉండగా అతడి చెప్పులు తెగిపోయాయి.
Bees Viral Video: మృత్యువును ముట్టుకోవడమంటే ఇదే.. ఇతను చేస్తున్న నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
చెప్పు తెగినప్పుడు ఎవరైనా సమీపంలో చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్తారు. అయితే ఈ వైద్యుడు మాత్రం.. తానే స్వయంగా ఆ పని చేసుకున్నాడు. ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న కత్తెర, దారాన్ని చూడగానే.. అతడి బుర్రలో బల్బ్ వెలిగింది. ఆ దారంతో తన చెప్పులను తానే ఎందుకు కుట్టుకోకూడదు అని ఆలోచించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా అక్కడే ఉన్న టేబుల్‌పై (Doctor Sewing Slippers in Operation Theater) తన చెప్పులను పెట్టి.. ఆపరేషన్ చేసే కత్తెర, దారంతో కుట్టడం స్టార్ట్ చేశాడు.
Jugaad Viral Video: వామ్మో.. ఫ్రిడ్జ్‌ను ఇలా సెట్ చేశాడేంటీ.. డోరు తీయగానే షాకింగ్ సీన్..
ఈ ఘటనను అక్కడే ఉన్న సిబ్బంది వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వైద్యుడు చెప్పుల మీద ప్రాక్టీస్ చేస్తున్నట్లున్నాడు’’.. అంటూ కొందరు, ‘‘తన చెప్పులను తాను కుట్టుకుంటున్నాడు.. ఇందులో తప్పేమీ లేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 12 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Biker Viral Video: సాటి బైకర్‌కే ఇతడి బాధ అర్థమవుతుంది.. ఎలాంటి సమస్య వచ్చిందో మీరే చూడండి..
ఇవి కూడా చదవండి..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..