Jugaad Viral Video: వామ్మో.. ఫ్రిడ్జ్‌ను ఇలా సెట్ చేశాడేంటీ.. డోరు తీయగానే షాకింగ్ సీన్..
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:23 PM
సాధారణంగా అందరూ ఫ్రిడ్జ్‌ను దేనికి వాడుతుంటారు.. అని అడిగితే.. అదేం పిచ్చి ప్రశ్న.. ఆహార పదార్థాలు చెడిపోకుండా భద్రపరిచేందుకు, చల్లని నీటి కోసం అని సమాధానం చెబుతాం. కానీ ఓ వ్యక్తి ఫ్రిడ్జ్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. .

ఇంట్లోని వస్తువులను కొందరు చిత్ర విచిత్ర పద్ధతుల్లో వాడడం చూస్తుంటాం. గ్యాస్ స్టవ్‌ను అంతా వంట చేసేందుకు వాడితే.. కొందరు దాన్ని బాత్రూం షవర్‌లా వాడడం చూశాం. అలాగే బీరువాను అంతా దస్తులు భద్రపరుచుకోవడానికి వాడితే.. కొందరేమే ఏకంగా వాటి తలుపులను ఏకంగా బాత్రూంకు ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి ఫ్రిడ్జ్ డోర్లను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఫ్రిడ్జ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా అందరూ ఫ్రిడ్జ్‌ను దేనికి వాడుతుంటారు.. అని అడిగితే.. అదేం పిచ్చి ప్రశ్న.. ఆహార పదార్థాలు చెడిపోకుండా భద్రపరిచేందుకు, చల్లని నీటి కోసం అని సమాధానం చెబుతాం. కానీ ఓ వ్యక్తి ఫ్రిడ్జ్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఫ్రిడ్జ్‌ను అందరిలా వాడితే కిక్ ఏముంటుందీ.. అని అనిపించిందో ఏమో గానీ.. చివరకు దాన్ని విచిత్రంగా వాడేశాడు. ఫైనల్‌గా కెమెరా ఆన్ చేసి తన ప్రయోగాన్ని అందరికీ చూపించాడు. నేరుగా ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లి డోరు పట్టుకుని లాగాడు. ఇలా లాగేయగానే లోపల ఆహార పదార్థాలకు బదులుగా.. ఇంటి బయట వ్యూ కనిపించింది. ఇంటి తలుపులకు బదులుగా (Replacing house doors with fridge doors) ఫ్రిడ్జ్ డోర్లను ఏర్పాట్లు చేసిన విషయం తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు.
Bees Viral Video: మృత్యువును ముట్టుకోవడమంటే ఇదే.. ఇతను చేస్తున్న నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫ్రిడ్జ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Jugaad Viral Video: ఈ అల్మారాలోని నగదు కొట్టేయడం అసాధ్యం.. దొంగలకు ఎలా షాకిచ్చాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..