Home » Doctor
ప్రస్తుతం వేసవి సీజన్ ఆరంభమైంది. ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటుతోంది. ప్రతిఒక్కరూ ఏదో ఒకపనిమీద బయటకు వెళ్లక తప్పదు. ఈ క్రమంలో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. అయితే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వడదెబ్బ తగలకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ జాగ్రతలేంటో ఇప్పుడు తెలుపుకుందాం.
Cloth Found In UP Womans Stomach: నార్మల్ డెలివరీ కుదరదని, సర్జరీ చేయాల్సిందేనని డాక్టర్లు చెప్పారు. 2023, నవంబర్ 14వ తేదీన ఆమెకు సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన కొద్దిరోజుల తర్వాత అన్షుల్ ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన నాటి నుంచి ఆమె కడుపులో నొప్పి మొదలైంది.
ఆస్పత్రుల్లో కొన్నిసార్లు వైద్యులు, మరికొన్నిసార్లు రోగులు చిత్రవిచిత్రగా ప్రవర్తించడం చూస్తుంటాం. డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటే.. మరోవైపు రోగి ఖైనీ వేసుకోవడం చూశాం. అలాగే ఆపరేషన్ థియేటర్ ఫోన్లు చూసుకుంటూ టైప్ పాస్ చేసే వైద్యులనూ చూశాం. ఇలాంటి..
ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న రోగికి చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రి నిరాకరించగా.. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు విక్రమ్, రంగా అజ్మీరా శస్త్రచికిత్స చేసి కాపాడిన విషయం తెలిసిందే.
Dolo 650 Overuse in India: కాస్త జ్వరం, తలనొప్పి లేదా ఒళ్లు నొప్పులు రాగానే మరో ఆలోచన లేకుండా డోలో 650 మింగేస్తున్నారా.. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ఈ ఒక్క మాత్రతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయని అనుకుంటున్నారా.. ఇలా వాడటం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో మీరు ఊహించలేరు. భారతీయుల్లో పెరుగుతున్న డోలో 650 వినియోగంపై ఒక డాక్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
Hyderabad: గాంధీ ఆస్పత్రి వైద్యులు అద్భుతం చేశారు. అరుదైన సర్జరీ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. ప్రమాదవశాత్తూ యువకుడి కంట్లో దిగిన స్క్రూ డ్రైవర్ ను చాకచక్యంగా తొలగించి అతడిని ప్రాణాపాయం నుంచి తప్పించి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఆ వృద్ధుడు నిజంగా చాలా అదృష్టవంతుడే... 74 ఏళ్ల వృద్ధుడు తన అనే వారు ఎవరూ లేకుండానే ఒంటరిగా విమానంలో ప్రయాణి చేస్తున్నాడు. అయితే.. ఇంతలోనే అతను తీవ అస్వస్తతకు గురయ్యాడు. అయితే అదే విమానంలో ప్రయాణిస్తున్న మహిళా డాక్టర్ అతనికి చికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడింది.
రక్తపోటు నియంత్రణకు రోగులకు చేసే రీనల్ డెనర్వేషన్ థెరపీ అనే వైద్య విధానం హైదరాబాద్, బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రిలో అందుబాటులోకి రానుంది.
క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ వినియోగించి సత్ఫలితాలు సాధించారు.
Fake Doctor: డాక్టర్ జాన్ అలియాస్ నరేంద్ర ఇప్పటి వరకు 15 సర్జరీలు చేశాడు. ఆపరేషన్ చేసిన కొన్ని గంటల్లోనే 7 మంది చనిపోయారు. పోలీసులు డాక్టర్ జాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.