Share News

Health: ఒకే రోజు ముగ్గురికి రోబోటిక్‌ సర్జరీలు..

ABN , Publish Date - Nov 26 , 2025 | 09:41 AM

ముగ్గురు మహిళలకు రోబోటిక్‌ విధానం ద్వారా శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సింగపూర్‌, దుబాయ్‌, భారత్‌ మహిళలకు గైనకాలజీ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. నగరంలోని కేర్‌ ఆస్పత్రి గైనకాలజీ బృందం ఈ శస్త్ర చికిత్సలను నిర్వహించారు.

Health: ఒకే రోజు ముగ్గురికి రోబోటిక్‌ సర్జరీలు..

- సింగపూర్‌, దుబాయ్‌, భారత్‌ మహిళలకు గైనకాలజీ శస్త్ర చికిత్సలు

హైదరాబాద్‌ సిటీ: ఒకే రోజు మూడు సంక్లిష్టమైన రోబోటిక్‌ గైనకాలజికల్‌ శస్త్ర చికిత్సలను కేర్‌ ఆస్పత్రి గైనకాలజీ బృందం నిర్వహించింది. సింగపూర్‌, దుబాయ్‌, భారతదేశానికి చెందిన ముగ్గురు మహిళలకు సీనియర్‌ గైనకాలజిస్టు, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ మంజుల అనగాని నేతృత్వంలో ఆధునిక వైద్య సేవల ద్వారా చికిత్స అందించినట్లు మంగళవారం కేర్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సింగపూర్‌కు చెందిన 48 ఏళ్ల మహిళ గర్భాశయం లోపలి గదిలోకి ఎదిగే మాంసకండ పెరుగుదల(సబ్‌ ముకోసల్‌ ఫైబ్రాయిడ్‌)తో పాటు దీర్ఘకాలంగా అసాధారణ గర్భాశయ రక్తస్రావంతో బాధపడుతోంది.


ఆమెకు రోబోటిక్‌ హిస్టరెక్టమీ, బైలేటరల్‌ సాల్పింగెక్టమీ, అథెసియోలిసిస్‌ సర్జరీ నిర్వహించారు. అలాగే ఎండోమెట్రియల్‌ హైపర్‌ప్లాసియాతో బాధపడుతున్న దుబాయ్‌కు చెందిన 50 ఏళ్ల మహిళకు రెండు వైపులా ఫాలోపియన్‌ ట్యూబులు, అండాశయాలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించే ప్రక్రియ చేశారు. హైదరాబాద్‌ చెందిన 37 ఏళ్ల మహిళకు గర్భాశయ శస్త్ర చికిత్స చేసి అతుకులు తొలగించడం (అధేషియోలిసిస్‌), శరీర నిర్మాణాన్ని తిరిగి సరిచేయడం,


city6.jpg

అండాశయ సిస్టును తొలగించడం, అలాగే రెండు ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ను తొలగించడం చేశారు. మహిళల్లో కనిపించే సంక్లిష్టమైన జననేంద్రియ వ్యాధులను రోబోటిక్‌ సర్జరీ ద్వారా మరింత కచ్చితంగా, అతి తక్కువ గాయంతో చికిత్స చేయగలుగుతున్నామని కేర్‌ వాత్సల్య ఉమెన్‌ చైల్డ్‌ ఇనిస్టిట్యూట్‌ క్లినికల్‌ డైరెక్టర్‌, విభాగాధిపతి డాక్టర్‌ మంజుల అనగాని తెలిపారు. జోనల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ బిజూ ఎస్‌. నాయర్‌ వైద్య బృందాన్ని అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు

మావోయిస్టుల కస్టడీ పిటిషన్‌ వెనక్కి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2025 | 09:41 AM