Share News

Health: మహిళ కడుపులో 8 కిలోల కణతి..

ABN , Publish Date - Nov 27 , 2025 | 10:22 AM

మహిళ కడుపులోంచి 8 కిలోల కణతిని వైద్యులు గుర్తించారు. నగరంలోని వాసవి ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి ఈ కణతిని తొలగించారు. స్లీవ్‌ గ్యాస్ర్టెక్టమీ పద్ధ్దతిలో శస్త్రచికిత్స నిర్వహించి ఆ కణితిని తొలగించారు.

Health: మహిళ కడుపులో  8 కిలోల కణతి..

- వాసవి ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

హైదరాబాద్: వాసవి ఆస్పత్రి(Vasavi Hospital)లో అరుదైన శస్త్రచికిత్స చేశారు. మహిళ పొట్టలోంచి 8 కిలోల కణతిని తొలగించారు. ప్రముఖ సర్జికల్‌ గ్యాస్ర్టో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ హజరతయ్య(Dr. Hazarathaya) ఈ అరుదైన శస్త్ర చికిత్సను స్లీవ్‌ గ్యాస్ర్టెక్టమీ పద్ధతిలో మూడు గంటలపాటు చేశారు. బుధవారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను డాక్టర్‌ హాజరతయ్య వెల్లడించారు. నగరానికి చెందిన 58 సంవత్సరాల మహిళ విపరీతమైన కడుపునొప్పి, ఆహారం తీసుకోకలేకపోవడం వంటి సమస్యలతో రెండు రోజుల క్రితం వాసవి ఆస్పత్రికి వచ్చింది.


city7.2.jpg

డాక్టర్‌ హజరతయ్య నేతృత్వంలో ఆమెను పరీక్షించి, ఎంఆర్‌ఐ పరీక్ష చేయడంతో కడుపులో భారీ గడ్డ ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం ఆమెకు స్లీవ్‌ గ్యాస్ర్టెక్టమీ పద్ధ్దతిలో కడుపులోని గడ్డను తొలగించినట్లు తెలిపారు. సమావేశంలో అనస్థిటిస్ట్‌ డాక్టర్‌ శ్రీవాణి టీం, వాసవి ఆస్పత్రి చైర్మన్‌ కె.జయప్రకాశ్‌ రాం, ప్రధాన కార్యదర్శి కొండ్లె మల్లికార్జున్‌, కోశాధికారి ఎం.దయాకర్‌గుప్తా, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌రావు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2025 | 10:22 AM