Share News

Hyderabad Doctor Tragedy: వీసా రాకపోవడంతో మనస్థాపానికి గురై వైద్యురాలు ఆత్మహత్య

ABN , Publish Date - Nov 24 , 2025 | 08:58 AM

వీసా రాకపోవడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ పద్మారావు నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వైద్యురాలు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Hyderabad Doctor Tragedy: వీసా రాకపోవడంతో మనస్థాపానికి గురై వైద్యురాలు ఆత్మహత్య
Hyderabad Doctor Tragedy

హైదరాబాద్, నవంబరు24 (ఆంధ్రజ్యోతి): వీసా రాకపోవడంతో ఓ వైద్యురాలు (Doctor) ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ (Hyderabad) పద్మారావు నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం డాక్టర్ రోహిణికి వీసా రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మనస్థాపం చెంది నిద్రమాత్రలు మింగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రోహిణి గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. వైద్యురాలు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిణి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. గుంటూరులో ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 24 , 2025 | 10:37 AM