Share News

Chennai News: ఆమె అవయవాలు సజీవం...

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:05 PM

తాను చనిపోతూ.. మరో ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించింది ఓ వైద్యురాలు. రోహిణి అనే వైద్యురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. బ్రెయిన్ డెడ్ అవడంతో అవయవాలను దానం చేశారు. వాటిని ఐదుగురికి అమర్చారు.

Chennai News: ఆమె అవయవాలు సజీవం...

- ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యురాలు

చెన్నై: మెదడు నిర్జీవమైన వైద్యురాలు, తన అవయవాలతో ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించారు. సేలం మారమంగళత్తుపట్టికి చెందిన రోహిణి (25) తేని ప్రభుత్వ వైద్యకళాశాలలో మెడిసిన్‌ పీజీ చేస్తోంది. ఈ నెల 16న రోడ్డు ప్రమాదంలో గాయపడిన రోహిణిని తేని ప్రభుత్వ కళాశాలలో చేర్పించారు. అనంతరం మదురై మీనాక్షి స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స ఫలించక మంగళవారం డాక్టర్‌ రోహిణి మెదడు నిర్జీవమైనట్లు వైద్యులు నిర్ధారించారు.


nani4.2.jpg

కుటుంబ సభ్యులు ఆమె అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. ప్రత్యేక శస్త్రచికిత్స ద్వారా రోహిణి(Rohini) అవయవాలను వైద్యులు తొలగించి, వాటిని అవసరమైన ఆస్పత్రులకు పంపించారు. డాక్టర్‌ రోహిణి మృతదేహానికి ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సెల్వరాజ్‌, తేని ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ ముత్తు చిత్ర, సహచర వైద్యులు, నర్సులు, సిబ్బంది నివాళులర్పించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్‌ రోహిణి అంత్యక్రియలు జరిగాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

మూగబోయిన మావోయిస్టుల కంచుకోట!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 20 , 2025 | 01:05 PM