Home » Chennai
లెజెండరీ యాక్టర్, కమల్ హాసన్ పెద్దల సభకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనను రాజ్యసభకు పంపాలని మక్కళ్ నీది మయ్యం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్ నీది మయ్యం పార్టీకి.. రాజ్యసభ సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు తెలియవచ్చింది.
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ పార్టీ పదవి నుంచి తప్పించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ సోమవారం కలిశారు.
వివాదాస్పద గురువు నిత్యానంద జీవించే ఉన్నారని ఆయన వెబ్సైట్ ‘కైలాస’ వెల్లడించింది. ఉగాది వేడుకలు నిర్వహించినట్లు ప్రకటించడంతో మృతిచెందారని వచ్చిన వార్తలను ఖండించింది
ప్రయాణికుల రద్దీ కారణంగా సికింద్రాబాద్-రామనాథపురం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ నెల 2,9,26,23,30 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుందని వారు తెలిపారు.
స్వామి నిత్యానంద రెండు రోజుల క్రితం సజీవ సమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటించాడు. ఈ ప్రకటనతో ఆయన భక్తులలో విషాదం నెలకొంది, నిత్యానంద ఆస్తులు ఇప్పుడు రంజితకే చేరే అవకాశం ఉందని సమాచారం
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం'రహస్యం'గా డీఎంకేకు సహకరిస్తోందని విజయ్ ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కాంగ్రెస్ వైపు డీఎంకే ఉంటూ, కుంభకోణాలప్పుడు రహస్యంగా బీజేపీ సైడ్ ఉంటోందని అన్నారు. తమళనాడు పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు.
CM Chandrababu Statement: ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప అడుగు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయన్నారు. 1991 ఆర్థిక సంస్కరణలు ఎంపిక కాదు.. తప్పనిసరి అని సీఎం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం చెన్నై నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అడయార్‌లోని ‘మద్రాస్ ఐఐటీ’లో ఉదయం 11 గంటలకు జరుగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025’లో పాల్గొని ప్రసంగించనున్నారు.
జనాభా దామాషా ప్రాతిపదికన పునర్విభజనను దక్షిణాది వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న ఈ పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లోని మనం రాజకీయ గళం కోల్పోతాం.