Share News

Tirupati Trains: తిరుపతి వెళ్లే రైళ్ల వేళల్లో మార్పులు...

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:51 PM

తిరుపతి వెళ్లే నాలుగు మెము రైళ్లు ఫిబ్రవరి 5వ తేది వరకు తిరుచానూరు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి. అరక్కోణం నుంచి తిరుపతికి ఉదయం 9.15 గంటలకు వెళ్లే రైలు తిరుచానూరు వరకు మాత్రమే వెళ్తుంది. మరుమార్గంలో, అరక్కోణం వెళ్లే మెము సాయంత్రం 3.40 గంటలకు తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది.

Tirupati Trains: తిరుపతి వెళ్లే రైళ్ల వేళల్లో మార్పులు...

చెన్నై: తిరుపతి వెళ్లే నాలుగు మెము రైళ్లు ఫిబ్రవరి 5వ తేది వరకు తిరుచానూరు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి...

- అరక్కోణం నుంచి తిరుపతి(Tirupati)కి ఉదయం 9.15 గంటలకు వెళ్లే రైలు తిరుచానూరు వరకు మాత్రమే వెళ్తుంది. మరుమార్గంలో, అరక్కోణం వెళ్లే మెము సాయంత్రం 3.40 గంటలకు తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది.


nani5.jpg

- చెన్నై సెంట్రల్‌(Chennai Central) నుంచి తిరుపతికి ఉదయం 9.50 గంటలకు వెళ్లే రైలు తిరుచానూరు వరకు మాత్రమే వెళ్తుంది. మరుమార్గంలో, మధ్యాహ్నం 1.25 గంటలకు తిరుపతి నుంచి వెళ్లే రైలు తిరుచానూరు నుంచి బయల్దేరనుంది.


nani5.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల!

కిసాన్‌ డ్రోన్‌.. సాగు ఖర్చు డౌన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 08 , 2025 | 12:52 PM