Actors Receive Bomb Threats: రజనీ, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
ABN , Publish Date - Oct 28 , 2025 | 09:33 PM
తేనాంపేట పోలీసుల కథనం ప్రకారం, అక్టోబర్ 27వ తేదీ ఉదయం 8.30 గంటలకు రజనీకాంత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు మొదటి మెయిల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్‌తో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
చెన్నై: తమిళనాడులో మళ్లీ సినీ, రాజకీయ ప్రముఖులకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajanikanth), ధనుష్ (Dhanush) ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. పోయస్ గార్డెన్‌లోని రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో బాంబులు పెట్టినట్టు చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి సోమవారంనాడు ఇ-మెయిల్ వచ్చినట్టు పోలీసులు మంగళవారం తెలిపారు.
తేనాంపేట పోలీసుల కథనం ప్రకారం, అక్టోబర్ 27వ తేదీ ఉదయం 8.30 గంటలకు రజనీకాంత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు మొదటి మెయిల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్‌తో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే బాంబు స్వ్కాడ్ అవసరం లేదని రజనీకాంత్ టీమ్ చెప్పడంతో వారు వెనుదిరిగారు. రెండో మెయిల్ సాయంత్రం 6.30 గంటలకు వచ్చినప్పుడు కూడా పోలీసులకు రజనీ టీమ్ నుంచి ఇదే సమాధానం వచ్చింది.
కాగా, నటుడు ధనుజ్‌కు సైతం అదేరోజు బాంబు-బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆయన కూడా సహాయానికి నిరాకరించారు. కొద్ది వారాలుగా పలువురు ప్రముఖులకు ఇదే తరహా బెదిరింపులు వస్తున్నాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ సమాచారం ఎక్కడి నుంచి వస్తోందో ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎంసీడీ వార్డుల్లో ఉపఎన్నికలను ప్రకటించిన ఈసీ
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా బస్సు దగ్ధం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి