Hyderabad: చందమామను తాకాలి... మార్స్‌పైకి వెళ్లాలన్నది నా కల..
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:01 AM
తన వయసు పిల్లలకు పూర్తిగా భిన్నం. అంతరిక్ష రహస్యాలను శోధిస్తోంది. పోస్ట్ డాక్టోరల్ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు. ఇటీవలే కెనడియన్ ఆర్కిటిక్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇండియాలో అతి పిన్న వయసు అనలాగ్ ఆస్ట్రోనాట్‌గా గుర్తింపు పొందింది.
- నాసా స్పేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్-2026కు ఇనియా ప్రగతి ఎంపిక
- శాటిలైట్, ఐఎస్ఎస్ చిత్రాల విశ్లేషణకు దక్కిన గౌరవం
- బయో ఇన్‌స్పైర్డ్ ఫ్రాంటియర్స్ 2025లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆస్ట్రోనాట్ ట్రైనీ
హైదరాబాద్ సిటీ: తన వయసు పిల్లలకు పూర్తిగా భిన్నం. అంతరిక్ష రహస్యాలను శోధిస్తోంది. పోస్ట్ డాక్టోరల్ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు. ఇటీవలే కెనడియన్ ఆర్కిటిక్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇండియాలో అతి పిన్న వయసు అనలాగ్ ఆస్ట్రోనాట్‌గా గుర్తింపు పొందింది. 2026లో నిర్వహించబోయే నాసా స్పేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కూ ఎంపికైంది. ‘‘చందమామను తాకాలి... మార్స్ (బుధగ్రహం)పై ఆవాసం ఏర్పరుచుకోవాలన్నది నా కల అని’’ చెబుతున్నది. బయోఇన్‌స్పైర్డ్ ఫ్రాంటియర్స్ 2025 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సదస్సులో పాల్గొన్న చిన్నారిని ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించింది. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది..
పుట్టి పెరిగిందంతా చెన్నై(Chennai)లోనే. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నది. ప్రపంచంలోనే అతి పిన్న ఆస్ట్రోనాట్ ట్రైనీ. పలు అనలాగ్ మిషన్స్ పూర్తి చేసింది. అనలాగ్ మిషన్స్ అంటే వ్యోమగాములు చేసే అన్ని పనులు చేస్తున్నట.
మార్స్ పైకి వెళ్లాలన్నది తన కల. దీనిలో భాగంగా కెనడియన్ ఆర్కిటిక్ మిషన్‌ను పూర్తి చేసింది. అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. దాదాపు 15 రోజులక్కడ ఉన్నారు. అక్కడకు వెళ్లిన మొదటి భారతీయురాలు తాను. అలాగే ఈ మిషన్‌ను పూర్తి చేసిన ప్రపంచంలోనే అతి చిన్న వయస్కురాలు కూడా. ఎందుకీ మిషన్ అంటే, మార్స్ తరహా వాతావరణం ఈ దీవులలో ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)తో అతి సన్నిహితంగా పనిచేస్తున్నారు. నాసా, ఈసాలతో కూడా కలిసి పనిచేస్తున్నారు.
- ఇంటర్నేషనల్ మార్స్ సొసైటీ వారు ఎంపిక చేసిన బృందంలో సభ్యురాలిగా తాను కూడా డీవోన్ ఐల్యాండ్ వెళ్లారు. 14 మిలియన్ సంవత్సరాల క్రితం ఏదైతే ఉల్కా ప్రభావిత భాగం. అక్కడ తాను నీటి నమూనాలు తీసుకుని, మైక్రోబ్స్ కోసం శోధించారు.
ఆసక్తి..
ఈ ఆర్కిటిక్ మిషన్‌కు తన ఆసక్తి, చేసిన పరిశోధనలకు ప్రతిఫలం. తొమ్మిది సంవత్సరాలుగా తాను ఇదే పనిలో ఉన్నారు.. తన నాలుగవ యేటా నుంచి అంతరిక్షం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నాసా ఆఫర్ వచ్చిందిలా.. పుస్తకాలు కూడా..
ఐదేళ్లుగా నాసా ప్రోగ్రామ్‌లను అన్వేషిస్తూనే ఉన్నారు.. వారి శాటిలైట్ చిత్రాలను విశ్లేషించడం, ఐఎస్ఎస్ చిత్రాలను విశ్లేషించడం చేశారు. ఆసక్తి, నూతన సాంకేతికతలలో నైపుణ్యం చూసి వారు 2026లో నాసా ప్రోగ్రామ్‌కు ఆఫర్ ఇచ్చారు. అయితే తాను మూడు పుస్తకాలు రాశారు. మొదటిది ‘ఇనియా ఇన్ ఇన్ఫినైట్ యూనివర్శ్’. రెండవది ‘ఎవిడెన్స్ ఆప్ వాటర్ ఆన్ మార్స్’, మరోటి ‘వాటర్ ఆన్ మూన్’. మొదటి పుస్తకాన్ని తన తొమ్మిదేళ్ల వయసులో రాయగా, మూడవ పుస్తకం 13వ యేటా రాశారు.
మూడేళ్లలో అర్హత: ఇనియా ప్రగతి
‘‘మరో మూడు, నాలుగేళ్లలో అంతరిక్షంలోకి కచ్చితంగా వెళ్తాను. దీనికోసమే శిక్షణ తీసుకోబోతున్నా. నాకు మార్స్‌కు వెళ్లాలనేది కల. వెళ్లడమే కాదు, అక్కడే ఆవాసం ఏర్పరుచుకోవాలని కోరుకుంటున్నా. కమర్షియల్ ఆస్ట్రోనాట్ విభాగంతో పాటుగా అన్ని విధాల అవకాశాలను చూస్తున్నా. నా ప్లాన్ అయితే ముందు లో ఎర్త్ ఆర్బిట్ చేరుకోవాలి, ఆ తరువాత చంద్రుడిని ముద్దాడాలి.. చివరకు మార్స్ చేరాలనేది నా ప్రణాళిక. అది సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పటికిప్పుడు అంతరిక్షంలోకి వెళ్లడానికి నా వయసు సరిపోదు. మరో మూడు నాలుగేళ్లలో ఆ అర్హత వస్తుంది. ఎందరో వ్యోమగాములను కలిశాను. భారతదేశపు తొలి వ్యోమగామి రాకేష్ శర్మ నాకు స్ఫూర్తి. ఆయనను ఇటీవలే ఆయనను కలిశాను. నీ కల సాకారం చేసుకోవడానికి కష్టపడు. పట్టు వదలవద్దు అని ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
మావోయిస్టు మద్దతుదారులపై నజర్!
Read Latest Telangana News and National News