Diabetes: కంటిపై మధుమేహం కలవరం..
ABN , Publish Date - Nov 25 , 2025 | 08:00 AM
మధుమేహం అనేక అవయవాలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి అని, ప్రధానంగా నేత్రాలపై తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఒక ప్రకటనలో ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్యులు తెలిపారు.
- పెరుగుతున్న డయాబెటిక్ రెటినోపతి కేసులు
- 25 నుంచి 74 ఏళ్ల మధ్యలో ప్రభావం
- ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్యులు
హైదరాబాద్ సిటీ: మధుమేహ బాధితుల్లో కంటి సమస్యలు కవవర పెడుతున్నాయి. మధుమేహం(Diabetes) అనేక అవయవాలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి అని, ప్రధానంగా నేత్రాలపై తీవ్రత ఎక్కువగా ఉంటుందని అని సోమవారం ఒక ప్రకటనలో ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్యులు తెలిపారు. ప్రపంచంలో మధుమేహ బాధితుల్లో 17 శాతం మంది భారతీయులేనని పేర్కొన్నారు. 25 నుంచి 74 ఏళ్ల మధ్య గల వయస్సు వారు ప్రధానంగా డయాబెటిక్ రెటినోపతితో కంటిచూపు కోల్పోతున్నారన్నారు. దీర్ఘకాలిక మధుమేహం కారణంగా రెటినాలోని సూక్ష్మ రక్త నాళాలలో నష్టం ఏర్పడుతుందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి సుమారు 181 మిలియన్ల మంది డయాబెటిక్ రెటినోపతితో బాధపడే అవకాశం ఉందని ఒక అంచనాగా చెప్పారు. చూపులో తేలియాడే నల్ల బొట్టలు, ఒక్కోసారి మసకగా కనిపించడం, చూపులో నల్లగా కనిపించే ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు, చూపు తగ్గడం లేదా కోల్పోవడం వంటి సూచనలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. రక్తంలో చక్కెర, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో పెట్టుకోవడం, దూమపానానికి దూరంగా ఉండటం, వ్యాయామం చేయడం వంటితో ఈ సమస్య నుంచి దూరం కావచ్చని పేర్కొన్నారు.
పరీక్షలు తప్పని సరి
డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవాలి. టైప్-1 మధుమేహం ఉన్న రోగులు నిర్ధారణ అయిన 5 సంవత్సరాల తర్వాత, టైం-2 ఉన్న రోగులు మధుమేహం నిర్ధారణ అయిన తక్షణమే పూర్తి స్థాయి కంటి పరీక్షలు చేయించుకోవాలి. గర్భధారణకు ముందు, గర్భధారణ మొదటి తైమ్రాసికంలో మహిళలు కంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
- డాక్టర్ పద్మజా రాణి, విట్రియో రెటినల్ స్పెషలిస్టు, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత
అది బూటకపు ఎన్‌కౌంటర్: ఈశ్వరయ్య
Read Latest Telangana News and National News