Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
ABN , Publish Date - Apr 24 , 2025 | 08:07 PM
ఓ మహిళ డాన్స్ చేస్తూ రీల్ చేయాలని అనుకుంది. అయితే కాస్త వ్యూ బాగుండాలనే ఉద్దేశంతో చెట్టుకు గోడకు అవతల నిలబడి, ఎదురుగా కెమెరాను ఏర్పాటు చేసింది. ఇంకేముందీ.. కెమెరా ఆన్ చేసి డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మందికి రీల్స్ చేయడం ఒక పనిగా మారిపోయింది. కొందరికైతే ఇది ఓ వృత్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. ఉదయం లేచినప్పుటి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ ప్రతి సంఘటననూ వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కొందరు యువతులైతే రీల్స్ పిచ్చిలో పడి కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ డాన్స్ చేస్తూ రీల్ చేస్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ముందూ వెనుకా చూసుకోవాలనేది ఇందుకే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ డాన్స్ చేస్తూ రీల్ చేయాలని అనుకుంది. అయితే కాస్త వ్యూ బాగుండాలనే ఉద్దేశంతో చెట్టుకు గోడకు అవతల నిలబడి, ఎదురుగా కెమెరాను ఏర్పాటు చేసింది. ఇంకేముందీ.. కెమెరా ఆన్ చేసి డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది.
కెమెరా ఆన్ కాగానే ముందు, వెనుకా చూసుకోకుండా డాన్స్ చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో పూర్తిగా వెనక్కు వెళ్లడంతో గోడ తగులుకుని(Woman falls while dancing) ధబేల్‌మని అవతలి వైపు కిందపడిపోయింది. ఆమె కిందపడిపోవడం చూసిన మరో మహిళ పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. కిందపడిన ఆమెను పైకి లేపే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ గోడ ఎత్తు తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. అదే ఎత్తులో ఉండి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.
Biker Viral Video: సాటి బైకర్‌కే ఇతడి బాధ అర్థమవుతుంది.. ఎలాంటి సమస్య వచ్చిందో మీరే చూడండి..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డాన్స్ చేయడమే కాదు.. కాస్త వెనక కూడా చూసుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Jugaad Viral Video: వామ్మో.. ఫ్రిడ్జ్‌ను ఇలా సెట్ చేశాడేంటీ.. డోరు తీయగానే షాకింగ్ సీన్..
ఇవి కూడా చదవండి..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..