Share News

Funny Viral Video: డోర్ లాక్ చేసి మరీ డెత్ గేమ్.. ఈ కుర్రాళ్ల నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:46 PM

కొంతమంది యువకులు కలిసి ఓ గదిలో డోర్ లాక్ చేసుకుని వింత గేమ్ స్టార్ట్ చేస్తారు. గది మధ్యలో రకరకాల టపాసులు పెడతారు. ఆ తర్వాత గదిలో ఫుట్‌బాల్ పెట్టి దానిపై పెట్రోల్ పోశారు. చివరకు అంతా కలిసి ఎలాంటి గేమ్ ఆడారో మీరే చూడండి..

Funny Viral Video: డోర్ లాక్ చేసి మరీ డెత్ గేమ్.. ఈ కుర్రాళ్ల నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..

ప్రాణం పోయినా పర్లేదు.. సోషల్ మీడియాలో పాపులర్ అయి తీరాల్సిందే.. అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కొందరు ఏదోటి చేసి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాలని చూస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ప్రాణంతక విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెడుతూ వీడియోలు తీస్తుంటారు. తాజాగా కొందరు కుర్రాళ్లు ప్రవర్తించిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. డోర్ లాసుకుని మరీ గదిలో డెత్ గేమ్ స్టార్ట్ చేశారు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొంతమంది యువకులు కలిసి ఓ గదిలో (Dangerous game in locked room) డోర్ లాక్ చేసుకుని వింత గేమ్ స్టార్ట్ చేస్తారు. గది మధ్యలో రకరకాల టపాసులు పెడతారు. ఆ తర్వాత గదిలో ఫుట్‌బాల్ పెట్టి దానిపై పెట్రోల్ పోస్తారు. పెట్రోల్‌ను మండించగానే ఫుట్‌బాల్‌కు మంటలు అంటుకుంటాయి.

Toilets Funny Video: పేరుకు తగ్గట్టే పబ్లిక్ టాయిలెట్స్.. ఎలా ఉన్నాయో చూస్తే పగలబడి నవ్వుతారు..


ఆ తర్వాత వారంతా కలిసి ఫుట్‌బాల్‌ను (Football) అటూ, ఇటూ తన్నుతుంటారు. అలాగే అక్కడున్న టపాసులకూ (Firecrackers) నిప్పంటిస్తారు. టపాసులు నుంచి వచ్చే నిప్పు రవ్వలను తప్పించుకుంటూ, ఫుట్‌బాల్ ఆడాలనేది వారి ఉద్దేశం. ఓ వైపు టపాసులు పేలుతుండగా.. మరో వైపు మండుతున్న ఫుట్‌బాల్‌ను తన్నుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఏమాత్రం నిప్పు రవ్వలు మీద పడినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు.

Doctor Funny Video: కుట్లు వేయడమే కాదు చెప్పులు కుట్టడమూ తెలుసు.. ఆపరేషన్ థియేటర్‌లో ఈ డాక్టర్ నిర్వాకం చూస్తే..


వ్యూస్ కోసమని మరీ ఇలాంటి ప్రమాదకర గేమ్‌ను ఆడడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ గేమ్ ఏంట్రా బాబోయ్.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ఎంతో ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 4.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 25 , 2025 | 05:46 PM