Snake's Honeymoon: పాములకూ హనీమూన్.. వేల సర్పాలన్నీ కలిసి ఒకే ప్రాంతంలో..
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:52 PM
పాములకు హనీమూన్ ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో పాములన్నీ ఒకే చోటు కలుసుకుంటాయన్నమాట. అత్యంత అరుదుగా చోటు చేసుకునే ఈ దృశ్యాలను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఇంతకీ..

పాములకు హనీమూన్ ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో పాములన్నీ ఒకే చోటు కలుసుకుంటాయన్నమాట. అత్యంత అరుదుగా చోటు చేసుకునే ఈ దృశ్యాలను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఇంతకీ ఈ పాములన్నీ ఇలా ఎందుకు కలుసుకుంటాయి, ఆ ప్రాంతం ఎక్కడ ఉంది.. తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కెనడాలోని (Canada) మానిటోబా పరిధి నార్సిస్సేలో ప్రతి ఏదాదీ వింత ఘటన చోటు చేసుకుంటుంది. పాములకు హనీమూన్ (Snake's Honeymoon) స్పాట్‌గా పిలువబడే ఈ నగరానికి 75,000 నుంచి 1,50,000 వరకు పాములు వలస వస్తుంటాయి. శీతాకాలం ముగియగానే కెనడియన్ పాముల వలస ప్రారంభమవుతుంది.ఈ పాములలో గార్టర్ అనే పాములు ఎక్కువగా ఉంటాయి. వెచ్చదనం, సహచర్యం కోసం ఈ పాములన్నీ ఇక్కడికి వస్తుంటాయి. మగ, ఆడ పాములన్నీ ఇక్కడ కలుసుకుంటాయి. నెలల తరబడి నిద్రాణస్థితిలో ఉండే ఈ పాములు.. శీతకాలం ముగియగానే సున్నపురాయి సింక్ హోల్స్ వచ్చి ఇక్కడ జతకడుతుంటాయట.
ఏప్రిల్ చివరి నుంచి మే ప్రారంభంలో వాతావరణం వేడెక్కడం మొదలవగానే ముందుగా మగపాములు బయటికి వస్తాయి. అవన్నీ కలిసి ఆడ పాముల కోసం వేచి చూస్తుంటాయి. కొన్ని వారాల వ్యవధిలో ఆడ పాములు కూడా అక్కడికి చేరుకుంటాయి. తర్వాత మగ, ఆడ పాములన్నీ (Male and female snakes) కలిసి మెలికలు తిరుగుతూ జతకడుతుంటాయి. ఈ క్రమంలో పాముల మధ్య తీవ్రమైన పోటీ కూడా ఉంటుంది. మగపాములన్నీ కలిసి ఆడ పాముల చుట్టూ గుంపులుగా తిరుగుతూ వాటిని గెలవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రాసెస్‌ను మేటింగ్ బాల్ అని పిలుస్తుంటారు. ఆడపామును ఆకర్షించే క్రమంలో మగ పాములు ఫెరోమోన్లు అనే ప్రత్యేక సువాసనలను ఉపయోగిస్తాయట. ఇలా వేల పాములన్నీ ఓకే చోట కలవడం అరుదైన ఘట్టం.
నార్సిస్ స్నేక్ డెన్స్ (Narcisse Snake Dens) అని పిలిచే ఈ ప్రాతం వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ పర్యవేక్షణలో ఉంటుంది. అలాగే ఈ పాముల కలయిక ఘట్టాన్ని తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారట. మరో విషయం ఏంటంటే.. ఈ ప్రాంతం హైవేకి దగ్గరగా ఉండడం వల్ల కలిసే సమయంలో వేలాది సర్పాలు ప్రాణాలు కోల్పోతుంటాయట. దీంతో పాములను కాపాడేందుకు పర్యావరణవేత్తలు హైవే కింద సొరంగాలు, కంచెలను కూడా నిర్మించారు.
ఈ అతిపెద్ద పాముల సమావేశం మానిటోబాలోని నార్సిస్సేలో జరుగుతుంది. ఈ ప్రత్యేక దృగ్విషయాన్ని నార్సిస్ స్నేక్ డెన్స్ అంటారు.ఈ సమయంలో 75,000 నుండి 1,50,000 వరకు గార్టర్ పాములు ఇక్కడకు వస్తాయని చెబుతున్నారు. ఇలా ఎక్కడా లేని విధంగా వేలాది పాములన్నీ కలిసి ఒకేచోట సందడి చేసే ప్రాంతంగా నార్సిస్సే పట్టణం ప్రత్యేకతలను సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..