Tricks Viral Video: లైటర్ లేకుండానే స్టవ్ వెలిగించాడుగా.. ఇతడి ట్రిక్ చూస్తే కళ్లు తేలేస్తారు..
ABN , Publish Date - Apr 25 , 2025 | 08:11 PM
ఓ వ్యక్తి ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించాలని చూశాడు. అయితే ఆ సమయంలో అగ్గిపెట్టె, లైటర్ కనిపించలేదో ఏమో గానీ.. చివరకు విచిత్ర పద్ధతిలో వెలిగించాడు. ఇతడి విచిత్ర ప్రయోగం చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు..

కొందరు తెలివిగా చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు అతి తెలివిగా చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. అలాగే ఇంకొందరు బుర్రకు పదును పెట్టి చేసే ట్రిక్స్ చూసినప్పుడు.. ‘‘అరే ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి అగ్గిపెట్టె, లైటర్ లేకుండానే గ్యాస్ స్టవ్‌ను వెలిగించిన విధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించాలని చూశాడు. అయితే ఆ సమయంలో అగ్గిపెట్టె, లైటర్ కనిపించలేదో ఏమో గానీ.. చివరకు విచిత్ర పద్ధతిలో వెలిగించాడు. దోమలను తరిమికొట్టే రాకెట్ తీసుకొచ్చాడు.
Bear Viral Video: వామ్మో.. పడవను పసిగట్టిన ఎలుగుబంటి.. చివరకు ఏం చేసిందో చూడండి..
దోమల బ్యాట్‌ను స్టవ్‌పై పెట్టి, దాని మధ్యలో కత్తితో టచ్ చేశాడు. అలా టచ్ చేయగానే మంట పుట్టింది. ఆ మంట దాటికి స్టవ్ వెలిగిందన్నమాట. ఇలా అగ్గిపుల్ల, లైటర్ లేకుండా.. దోమల బ్యాట్‌తో స్టవ్ వెలిగించిన (Man lights gas stove with mosquito rocket) విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బ్యాచ్‌లర్ గది అంటే ఈ మాత్రం ఉండాలి మరి’’.. అంటూ కొందరు, ‘‘దోమల బ్యాట్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Funny Viral Video: డోర్ లాక్ చేసి మరీ డెత్ గేమ్.. ఈ కుర్రాళ్ల నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..