Share News

Bear Viral Video: వామ్మో.. పడవను పసిగట్టిన ఎలుగుబంటి.. చివరకు ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Apr 25 , 2025 | 07:28 PM

కొందరు పర్యాటకులు బోటులో నదిలోకి వెళ్తారు. నదిపై తిరుగుతూ అక్కడి అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇంతలో ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ ఎలుగుబంటి వారి బోటును గమనిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Bear Viral Video: వామ్మో.. పడవను పసిగట్టిన ఎలుగుబంటి.. చివరకు ఏం చేసిందో చూడండి..

ఎలుగుబంటికి ఎంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ఎలుగు జోలికి వెళ్లేందుకు పులులు, సింహాలు కూడా ఆలోచిస్తుంటాయి. పొరపాటున వాటితో ఫైట్‌కి దిగాయంటే మాత్రం.. చివరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఎలుగుబంటికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఎలుగుబంటి షాకింగ్ వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. పడవను పసిగట్టిన ఎలుగుబంటి దాన్ని వెంబడించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో ( Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు పర్యాటకులు బోటులో నదిలోకి వెళ్తారు. నదిపై తిరుగుతూ అక్కడి అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇంతలో ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ ఎలుగుబంటి వారి బోటును గమనిస్తుంది.

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..


పడవను చూడగానే పరుగెత్తుకుంటూ (Bear chasing speedboat) సమీపానికి వచ్చేస్తుంది. ఎలుగుబంటి రావడాన్ని గమనించిన బోటు సిబ్బంది వేగాన్ని పెంచుతారు. స్పీడు బోటు కావడంతో ఒక్కసారిగా అక్కడి నుంచి దూసుకుపోతుంది. అయినా ఎలుగుబంటి స్పీడు బోటును చాలా దూరం వరకూ వెంబడిస్తుంది. అయితే బోటు అత్యంత వేగంగా వెళ్లడం వల్ల ఎలుగు నుంచి తప్పించుకుంటుంది. ఈ ఘటనను బోటులోని వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Funny Viral Video: డోర్ లాక్ చేసి మరీ డెత్ గేమ్.. ఈ కుర్రాళ్ల నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ ఎలుగు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలుగుబంటిని ఎప్పుడూ రెచ్చగొట్టవద్దు.. వాటి బలం మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 43 వేలకు పైగా లైక్‌లు, 12.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Dog Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న కుక్క.. సమయానికి గమనించిన మరో కుక్క.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 25 , 2025 | 07:28 PM