Child Bites Cobra: ఆడుకుంటున్న చిన్నారి.. ఎదురుగా వచ్చిన నాగుపాము.. చివరకు షాకింగ్ ట్విస్ట్..
ABN , Publish Date - Jul 27 , 2025 | 08:33 AM
సునిల్ సాహ్ అనే ఏడాది వయసున్న బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో రెండు అడుగులు నాగుపాము అటుగా వచ్చింది. పామును బొమ్మగా భావించిన ఆ పిల్లాడు.. పట్టుకుని కొరికేశాడు. చివరకు ఏం జరిగిందంటే..

పాములతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం వాటికి జోలికి వెళ్లకుంటే అవి ఎలాంటి హానీ చేయవు. అయితే తెలిసి కొందరు, తెలీక మరికొందరు పాములను ఇబ్బంది పెడుతుంటారు. ఈ క్రమంలో పాటు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతుంటారు. అలాగే మరికొన్నిసార్లు ఆడుకునే చిన్న పిల్లలు తెలీక పాములను పట్టుకోవడం చూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, బీహార్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఏడాది వయసున్న బాలుడు.. నాగుపామును పట్టుకుని కొరికేశాడు. చివరకు ఆస్పత్రికి తీసుకెళ్లగా షాకింగ్ విషయం తెలిసింది.
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్ చంపారన్ జిల్లా బంకట్వా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సునిల్ సాహ్ అనే ఏడాది వయసున్న బాలుడు శుక్రవారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో రెండు అడుగులు నాగుపాము అటుగా వచ్చింది.
అది విషసర్పం అని తెలీని ఆ చిన్నారి పామును చేత్తో పట్టుకుని దగ్గరికి లాగాడు. అంతటితో ఆగకుండా దాన్ని (Child Bites Cobra) నోట్లో పెట్టుకుని గట్టిగా కొరికేశాడు. దీంతో ఆ పాము రెండు ముక్కలుగా విడిపోయింది. ఈ ఘటనలో పాము ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి పామును కొరకడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు బాలుడిని పరీక్షించగా.. శరీరంలో ఎలాంటి విషమూ లేదని తెలిసింది.
చిన్నారిని ప్రాణాపాయమేమీ లేదని వైద్యులు తెలిపారు. దీంతో బాలుడు కుటుంబ సభ్యలు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడు కొరకడంతో పాము చనిపోవడం, చిన్నారికి ఏమీ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన స్థానిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..
ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి