Share News

Desi Jugaad Viral Video: రూపాయి ఖర్చు లేకుండా కొళాయిని ఎలా సిద్ధం చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Jul 25 , 2025 | 09:32 AM

ఓ వ్యక్తి తన ఇంట్లోని వంట గదిలో కొళాయికి షవర్ తరహాలో మూతను ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ఎంతో తెలివిగా ఆలోచించాడు. ముందుగా బాటిల్ మూత తీసుకుని, దానిపై రంధ్రాలు చేశాడు. ఆ తర్వాత..

Desi Jugaad Viral Video: రూపాయి ఖర్చు లేకుండా కొళాయిని ఎలా సిద్ధం చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

తెలివి ఒకరి సొత్తు కాదు.. అనేది పెద్దల మాట. ఈ మాట వారు ఊరికే అనలేదు. అందుకు సాక్ష్యంగా నిత్యం మన కళ్ల ముందు ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటూ ఉంటుంది. కొందరు తమ బ్రెయిన్‌కు పనిపెట్టి.. ఎవరికీ సాధ్య కాని పనులను ఎంతో సులభంగా చేసేస్తుంటారు. మరికొందరు వింత వింత టెక్నిక్‌లతో పెద్ద పెద్ద సమస్యలకు సింపుల్‌గా చెక్ పెడుతుంటారు. ఇలాంటి వినూత్నమైన ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన తెలివితో రూపాయి ఖర్చు లేకుండా కొళాయిని మార్చిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. అతడిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని వంట గదిలో కొళాయికి (Tap) షవర్ తరహాలో మూతను ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ఎంతో తెలివిగా ఆలోచించాడు. ముందుగా బాటిల్ మూత (Bottle Cap) తీసుకుని, దానిపై రంధ్రాలు చేశాడు. ఆ తర్వాత ఆ మూత లోపల నీరు ఫిల్టర్ అయ్యేలా కాటన్‌ను పెట్టాడు.


ఆపై ఆ మూతకు బెలూన్ తగిలించి సగం కత్తిరించాడు. ఆ మూతకు ఉన్న బెలూన్‌ చివరను కొళాయికి తగిలించి గట్టిగా బిగించాడు. ఫైనల్‌గా ట్యాప్ ఆన్ చేయగానే నీళ్లు షవర్ తరహాలో బయటికి వచ్చాయి. అలాగే ఆ మూతను అటూ, ఇటూ తిప్పడం ద్వారా కింద ఉన్న సింక్‌ను మొత్తం శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశాడు. ఇలా రూపాయి ఖర్చు లేకుండా కొళాయిని విచిత్రంగా మార్చేశాడన్నమాట.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 69వేలకు పైగా లైక్‌లు, 1.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 09:53 AM