Divorced Women: వీళ్లేంటీ మరీ విచిత్రంగా ఉన్నారే.. విడాకుల శిబిరంలో వీళ్లు చేస్తున్న నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Jul 19 , 2025 | 02:10 PM
కేరళలోని కాలికట్‌కు చెందిన రఫియా అఫి అనే ఓ మహిళ.. ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా విడాకుల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో విడాకులు తీసుకున్న మహిళలు, ఒంటరి మహిళలు పాల్గొన్నారు. అంతా కలిసి ..

గొడవల కారణంగా కొందరు, అభిప్రాయభేదాల కారణంగా ఇంకొందరు, ప్రవర్తన నచ్చక ఇంకొందరు విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఆ తర్వాత ఒంటరిగా జీవించేవారు కొందరైతే.. మరికొందరు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుని జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. అయితే విడాకులు తీసుకున్న వారు సంతోషంగా సంబరాలు చేసుకోవడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి అరుదైన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడాకులు తీసుకున్న మహిళలంతా కలిసి శిబిరం నిర్వహించారు. ఈ వీడియో చూసిన వారంతా.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కేరళలోని కాలికట్‌కు చెందిన రఫియా అఫి అనే ఓ మహిళ.. ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా విడాకుల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో విడాకులు తీసుకున్న మహిళలు (Divorced women), ఒంటరి మహిళలు పాల్గొన్నారు. అంతా కలిసి బస్సులో ఓ సుందరమైన ప్రదేశానికి చేరుకున్నారు. బస్సులో ప్రయాణం మొదలుకాగానే.. అంతా కేకలు వేస్తూ, పాటలూ పాడుతూ, డబ్బులు కొడుతూ సంబరాలు చేసుకున్నారు.
ఓ ప్రదేశంలో అంతా కలుసుకుని వారి వేడుకలు నిర్వహించారు. ఎత్తైన కొండపై ఎంతో అందమైన ప్రదేశంలోఅంతా కలిసి టెంట్లు వేసుకోవడం, చలి మంటలు వేసుకోవడం, వివిధ రకాల ఆటలు ఆడడం.. ఇలా ఎంతో సరదాగా గడిపారు. ఈ శిబిరంలో (Divorce camp) యుక్త వయసు వారితో పాటూ మధ్య వయస్సు మహిళలు కూడా పాల్గొన్నారు. విడాకులు తీసుకున్న మహిళలంతా వారి గతాన్ని మర్చిపోయి, కొత్త ఆలోచనలు పెంపొందించుకోవడానికి, అందరిలో సరదాగా గడపడం ద్వారా బాధను మర్చిపోవడానికి ఈ శిబిరం నిర్వహించినట్లు నిర్వాహకురాలు తెలిపింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చాలా మంచి ఆలోచన’.. అంటూ కొందరు, ‘బాధలను మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 47 వేలకు పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..
కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి