Share News

Couple Funny Video: ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:44 PM

ఓ వ్యక్తి తన బైకుపై భార్యను ఎక్కించుకుని వెళ్తున్నాడు. అయితే వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మార్గమధ్యలో భార్యకు కోపం కట్టలు తెంచుకుంది. బైకుపై వెనక కూర్చున్న ఆమె.. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

Couple Funny Video: ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

దంపతుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. కొందరు దంపతులు నాలుగు గోడల మధ్య గొడవ పడితే.. మరికొందరు నలుగురిలో కొట్టాడుకుంటుంటారు. అయితే ఇంకొదరు మాత్రం.. బస్సులు, రైళ్లలో ఒకరిని మరొకరు కొట్టుకోవడం, తన్నుకోవడం చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బైకుపై వెనుక కూర్చున్న భార్య.. భర్తను చితకబాదింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బైకుపై భార్యను ఎక్కించుకుని వెళ్తున్నాడు. అయితే వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మార్గమధ్యలో భార్యకు కోపం కట్టలు తెంచుకుంది. బైకుపై వెనక కూర్చున్న ఆమె.. భర్తను తన రెండులతో చెంపలు చెల్లుమనిస్తోంది.


ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. (Wife slaps husband on bike) వరుసగా బాదుతూనే ఉంది. అయినా ఆ భర్తలో ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు. భార్య ఎంత కొడుతున్నా కూడా.. తన మానాన తాను బైకు నడుపుకొంటూ వెళ్తున్నాడు. ఇలా ఆమె చాలా దూరం వరకూ భర్తపై దాడి చేస్తూనే ఉంది. ఆ సమయంలో కారులో వెళ్తున్న వారు.. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈ మహిళ కోపం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఈ భర్తను చూస్తుంటే జాలేస్తోంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 390కి పైగా లైక్‌లు, 63 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఈమె తెలివి అమోఘం.. తాళం పాడవకుండా ఏం చేసిందంటే..

సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 09:27 PM