Share News

Crocodile Viral Video: పట్టుబడింది కదా అని మొసలిని కొరికేసింది.. చివరకు కుక్క పరిస్థితి చూస్తే..

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:42 AM

ఓ కేర్ టేకర్ మొసలిని ఎంతో జాగ్రత్తగా పట్టుకుంటాడు. ఇనుప కట్టర్ సాయంతో మొసలిని పట్టుకున్న అతను.. దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Crocodile Viral Video: పట్టుబడింది కదా అని మొసలిని కొరికేసింది.. చివరకు కుక్క పరిస్థితి చూస్తే..

మొసలి నీటిలో ఉంటే ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద జంతువునైనా అవలీలగా చంపేస్తుంది. అయితే అదే మొసలి ఒడ్డుపై ఉంటే.. చిన్న చిన్న జంతువులను కూడా ఎదుర్కోలేదు. ఈ విషయం తెలిసిన ఓ కుక్క.. గట్టున ఉన్న మొసలిపై దాడి చేయాలని చూసింది. అయితే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కేర్ టేకర్ మొసలిని ఎంతో జాగ్రత్తగా పట్టుకుంటాడు. ఇనుప కట్టర్ సాయంతో మొసలిని పట్టుకున్న అతను.. దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి పెంపుడు కుక్క.. మొసలిపై దాడి చేసేందుకు వెళ్లింది.


మొసలి గొంతు పట్టుకొని కొరికేందుకు ప్రయత్నించింది. కుక్క దాడి చేయడంతో (Dog attacks crocodile) మొసలి మొదట బాగా ఇబ్బంది పడింది. ఆ తర్వాత కోలుకుని కుక్క నోటిని గట్టిగా పట్టుకుంటుంది. దీంతో అప్పటిదాకా కొరికేందుకు ప్రయత్నించిన కుక్కకు చుక్కలు కనిపిస్తాయి. గట్టిగా మొరుగుతూ మొసలి బారి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా మొసలి చాలా సేపు అలాగే గట్టిగా పట్టుకుని ఉంది.


అయితే ఆ తర్వాత వదిలేయడంతో బతుకుజీవుడా.. అనుకుంటూ కుక్క అక్కడి నుంచి పారిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పట్టుబడింది కదా అని తక్కువ అంచనా వేస్తే ఇలాగే అవుతుంది’.. అంటూ కొందరు, ‘కుక్కకు చుక్కలు చూపించిన మొసలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7800లకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఈమె తెలివి అమోఘం.. తాళం పాడవకుండా ఏం చేసిందంటే..

సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 24 , 2025 | 12:44 PM