Woman Funny Video: శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..
ABN , Publish Date - Jul 24 , 2025 | 01:56 PM
ఓ మహిళ ఏదో రకంగా మంచి వీడియో తీసి, సోషల్ మీడియాలో వ్యూస్, లైక్‌లు సంపాదించాలని బలంగా నిర్ణయించుకుంది. ఇందుకోసం చివరకు ఆమె ఓ శివలింగం ముందు వీడియో చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ క్రమంలో ఆమెకు ఏమైందో మీరే చూడండి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువతీయువకులతో పాటూ గృహిణులు, వృద్ధులు కూడా రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో కొందరు హద్దులు మీరి ప్రవర్తించడం చూస్తున్నాం. కొందరు బహరంగ ప్రదేశాల్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే.. మరికొందరు వ్యూస్, లైకుల కోసం ఎదుటివారిని ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొందరికి ఊహించని షాక్‌లు తగులుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ శివలింగం ముందు కామెడీ చేయడానికి ప్రయత్నించింది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఏదో రకంగా మంచి వీడియో తీసి, సోషల్ మీడియాలో వ్యూస్, లైక్‌లు సంపాదించాలని బలంగా నిర్ణయించుకుంది. ఇందుకోసం చివరకు ఆమె ఓ శివలింగం ముందు వీడియో చేసేందుకు సిద్ధమైంది.
ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివలింగం వద్దకు వెళ్లిన ఆమె.. విచిత్రంగా ప్రవర్తించింది. తమాషాగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ శివలింగం ముందు విన్యాసాలు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి.. (Woman falls while doing reels) పైనుంచి దొర్లుకుంటూ కింద ఉన్న నీటిలో పడిపోయింది. ఇలా శివలింగం ముందు తమాషా చేయడానికి ప్రయత్నించి.. చివరకు నీటిలో పడిపోయిందన్నమాట.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏదో చేయాలని చూస్తే చివరికి ఇంకేదో అయింది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇలాగే అవుతుంది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 19 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఈమె తెలివి అమోఘం.. తాళం పాడవకుండా ఏం చేసిందంటే..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి