Share News

Patient Funny Video: ఆస్పత్రి బెడ్‌పై తెలివి చూపించిన పేషెంట్.. ఫోన్ ఎలా వాడాడో చూడండి..

ABN , Publish Date - Jul 25 , 2025 | 10:43 AM

ఓ వ్యక్తి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. అతన్ని బెడ్‌పై పడుకోబెట్టి సెలైన్ ఎక్కించారు. ఇందులో విశేషమేమీ లేకున్నా కూడా అతను ఫోన్ వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Patient Funny Video: ఆస్పత్రి బెడ్‌పై తెలివి చూపించిన పేషెంట్.. ఫోన్ ఎలా వాడాడో చూడండి..

అందరికీ కష్టం అనిపించే పనులు.. కొందరికి ఎంతో ఈజీగా అనిపిస్తుంటాయి. అలాగే అందరికీ సాధ్యం కాని పనులను కొందరు ఎంతో అవలీలగా చేసేస్తుంటారు. ఇంకొందరైతే చిన్న చిన్న టెక్నిక్‌లతో అద్భుతాలు చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఓ వ్యక్తి.. ఫోన్ వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘పేరుకే పేషెంట్.. తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. అతన్ని బెడ్‌పై పడుకోబెట్టి సెలైన్ ఎక్కించారు. ఇందులో విశేషమేమీ లేకున్నా కూడా అతను ఫోన్ వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.


చేత్తో ఫోన్ పట్టుకుని చూడడం కష్టంగా ఉండడంతో తన బుర్రకు పని పెట్టాడు. ఫోన్ కవర్ తీసేసి, దాన్ని ప్యాంట్ లోపలి (Smartphone Attached to Pant) నుంచి తీసుకొచ్చి మోకాలి కింద పెట్టాడు. తర్వాత ఫోన్‌ను దానిపై ఉంచి ప్రెస్ చేశాడు. దీంతో ఆ ఫోన్ కాస్తా.. మోకాలిపై ఎల్‌సీడీ టీవీలా మారిపోయింది. ఇలా సెట్ చేసి.. చేతులకు శ్రమ లేకుండా హాయిగా పడుకుని ఫోన్ చూడసాగాడు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పేషెంట్ అయినా టాలెంట్‌ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2600కి పైగా లైక్‌లు, 7 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 10:43 AM