Funny Trending Video: భోజనం చేస్తున్న అతిథులు.. సడన్‌గా స్టార్ట్ అయిన వర్షం.. చివరకు..
ABN , Publish Date - Jul 25 , 2025 | 12:49 PM
ఓ కార్యక్రమంలో అతిథులంతా భోజనం చేసేందుకు వరుసగా కూర్చున్నారు. ఇంతలో కొందరు యువకులు వారందరికీ వరుసగా వివి రకాల ఆహార పదార్థాలను వడ్డించారు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది..

శుభకార్యాలలో భోజనాల సమయంలో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు పెనం ఉన్న దోసెలను వేడి కాకుండానే లాక్కుంటుంటే.. మరికొందరు ఒకరిపై ఒకరు తోసుకుంటూ భోజనాల కోసం గొడవపడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కార్యక్రమంలో భోజనాలు చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో అతిథులంతా భోజనం (Guests eating meal) చేసేందుకు వరుసగా కూర్చున్నారు. ఇంతలో కొందరు యువకులు వారందరికీ వరుసగా వివి రకాల ఆహార పదార్థాలను వడ్డించారు. అయితే సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది.
సడన్‌గా వర్షం (Rain) స్టార్ట్ కావడంతో కొందరు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. అయితే మిగతా వారంతా ఎలాగైనా భోజనాలు కంప్లీట్ చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం చాలా తెలివిగా ఆలోచించారు. ఎదురుగా ఉన్న బెంచీల కిందకు కూర్చున్నారు. అంతా ఇలా వరుసగా బెంచీల కింద కూర్చోగా.. యువకుంతా వారికి యథావిధగా భోజనాలు వడ్డించడం స్టార్ట్ చేశారు. ఓ వైపు వర్షం పడుతుంటే.. మరోవైపు వారంతా ఎంచక్కా భోజనాలు తింటూ ఎంజాయ్ చేశారు.
ఇలా ఎంతో తెలివితో వర్షంలోనూ భోజనాలు చేసి అంతా అవాక్కయ్యేలా చేశారు. ఈ వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.‘వర్షం కురిసినా, పిడుగులు పడినా సరే.. తినేది ఆపేదే లేదు’.. అంటూ కొందరు, ‘బెంచ్‌ల భోజనం.. ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.85 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..
ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి