Share News

Watch Video: వామ్మో.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. ఈ యువకులకు ఏమైందో చూడండి..

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:26 PM

ముగ్గురు యువకులు ఓ డ్యామ్ వద్ద ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. వారిలో ఇద్దరు యువకులు నీళ్లలో నిలబడి ఉండగా .. మరో వ్యక్తి కాస్త దూరంగా నిలబడి వీడియో తీస్తుంటాడు. మోకాలి కంటే కింద ఉన్న నీటిలో వారంతా నిలబడి ఉండగా..

Watch Video: వామ్మో.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. ఈ యువకులకు ఏమైందో చూడండి..

ప్రమాదాలు చెప్పి రావు.. అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు కొందరు తెలిసి తెలిసి ప్రమాదాలకు ఎదురెళ్తుంటారు. మరికొందరు వ్యూస్, లైకుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముగ్గురు యువకులను ప్రమాదం ఎలా వెంటాడిందో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ప్రమాదం త్రుటిలో తప్పడమంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముగ్గురు యువకులు ఓ డ్యామ్ వద్ద ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. వారిలో ఇద్దరు యువకులు నీళ్లలో నిలబడి ఉండగా .. మరో వ్యక్తి కాస్త దూరంగా నిలబడి వీడియో తీస్తుంటాడు. మోకాలి కంటే కింద ఉన్న నీటిలో వారంతా నిలబడి ఉండగా.. ఉన్నట్టుడి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.


నీళ్లను ఒక్కసారిగా వదలడం వల్ల దూరం నుంచి అలలు ఎగిసిపడుతూ వస్తాయి. ఈ సీన్ చూసి వారంతా పరుగులు తీస్తారు. మరోవైపు వెనుక నుంచి నీళ్లు తరుముకుంటూ వస్తుంటాయి. ఆ ముగ్గురూ అత్యంత వేగంగా పరుగెత్తి.. ఒడ్డు పైకి చేరుకుంటారు. తరుముకుంటూ వచ్చినీ నీళ్లు... ఆ ఒడ్డును తాకి పైకి ఎగిసిపడి ఆగిపోతాయి. పరుగెత్తడంలో ఏమాత్రం ఆలస్యం అయి ఉన్నా కూడా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’.. అంటూ కొందరు, ‘చావు తరుముకుంటూ రావడమంటే ఇదే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1100కి పైగా లైక్‌లు, 1.43 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 01:26 PM