Share News

Monkey And Snake Video: కోతి పవర్ మామూలుగా లేదుగా.. నాగుపాము ముందు మోకరిల్లి.. చివరకు..

ABN , Publish Date - Jul 31 , 2025 | 08:00 AM

ఓ వ్యక్తి గొలుసుతో కట్టేసిన కోతిని పాము వద్ద వదులుతాడు. పాము ఎదురుగా కూర్చున్న కోతి.. దాన్ని చూడగానే ముందుగా తల నేలకు ఆనించి మోకరిల్లింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

Monkey And Snake Video: కోతి పవర్ మామూలుగా లేదుగా.. నాగుపాము ముందు మోకరిల్లి.. చివరకు..

కోతులు కొన్నిసార్లు అందరికీ చిరాకు చెప్పిస్తే.. మరికొన్నిసార్లు అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటాయి. లాక్కున్న వస్తువులను తిరిగి ఇచ్చేయడానికి లంచం డిమాండ్ చేసే కోతులు కొన్నైతే.. మరికొన్ని కోతులు తోటి జంతువులతో వింత వింత గేమ్స్ ఆడుతుంటాయి. అలాగే మరికొన్ని కోతులు ఏకంగా విష సర్పాలతోనే ఆటలు ఆడుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి నాగుపాము ముందు మోకరిల్లింది. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గొలుసుతో కట్టేసిన కోతిని పాము వద్ద వదులుతాడు. పాము ఎదురుగా కూర్చున్న కోతి.. దాన్ని చూడగానే ముందుగా తల నేలకు ఆనించి మోకరిల్లింది. ఆ తర్వాత పైకి లేచి వెంటనే పామును పట్టుకుని మెడలో వేసుకుంటుంది.


కోతి మెడపై వేసుకన్నా కూడా ఆ పాము ఎలాంటి హానీ చేయదు. పైగా ఆ కోతి నుంచి తప్పించుకుని వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది. కోతి మెడపై నుంచి జారుకుంటూ కిందకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయినా కోతి మాత్రం ఆ పామును వదలకుండా అలాగే మెడలో వేసుకుని ఉంటుంది. ఈ ఘటన సమయంలో కోతిని గొలుసుతో పట్టుకున్న వ్యక్తి.. అలాగే చూస్తుంటాడు తప్ప కోతిని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడు. ఈ ఘటనపై ప్రజలు మండిపడుతున్నాురు.


కోతితో ఇలాంటి పనులు చేయించడం దారుణం.. అంటూ మండిపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈ కోతి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పనులు చేయించడం చాలా ప్రమాదం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లు, 5.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 08:07 AM