Share News

Woman Theft Viral Video: ఇలాంటి చోరీ ఎక్కడా చూసుండరు.. ఎంత తెలివిగా కొట్టేసిందో చూడండి..

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:22 AM

ఆలయం వద్ద మహిళలంతా పూజలు చేస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒకరినొకరు తోసుకుంటుంటారు. ఇలాంటి సమయంలో ఓ మహిళ చేతివాటం ప్రదర్శించింది. మెడలో బంగారు గొలుసు ఉన్న మహిళను టార్గెట్ చేసింది. చివరకు ఎలా చోరీ చేసిందో మీరే చూడండి..

Woman Theft Viral Video: ఇలాంటి చోరీ ఎక్కడా చూసుండరు.. ఎంత తెలివిగా కొట్టేసిందో చూడండి..

దొంగతనాలు చేయడంలో కొందరి స్లైల్ చూస్తే..అందులో మాస్టర్ డిగ్రీ చేశారేమో అని అనిపిస్తుంటుంది. పక్కనే ఉంటూ ఎమాత్రం అనుమానం రాకుండా విలువైన వస్తువులను ఎత్తుకెళ్తుంటారు. మరికొన్నిసార్లు కళ్లెదురుగా ఉన్నా కూడా కళ్లగప్పి మోసాలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆలయం వద్ద మహిళలంతా పూజలు చేస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒకరినొకరు తోసుకుంటుంటారు. ఇలాంటి సమయంలో ఓ మహిళ చేతివాటం ప్రదర్శించింది. మెడలో బంగారు గొలుసు ఉన్న మహిళను టార్గెట్ చేసింది.


ఆమె వెనుకే తాను కూడా ప్లేట్‌లో పూజా సామగ్రిని పట్టుకుని వెళ్లింది. మధ్యలో అదును చూసి మెల్లగా తన చేయిని ఆమె భుజంపై వేసింది. ఆ తర్వాత అంతే తెలివిగా గొలుసును పట్టుకుంటుంది. కొద్ది సేపటి తర్వాత రెండు చేతులతో ఆ గొలుసును ఊడదీస్తుంది. వెనుక భుజంపై చేతులు వేయడంతో ఆమె వెనక్కు తిరిగి చూస్తుంది. దీంతో ఆ దొంగ మహిళ (cunning woman stole woman's chain from her neck)వెంటనే చేయి పైకి పెట్టి నటిస్తుంది.


అప్పటికే ఆమె మెడలోని గొలుసు ఈమె చేతిలోకి వచ్చేసి ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఇలా భక్తుల ముసుగులో వెనుకే వెళ్లి.. చైన్ కొట్టేసిన మహిళను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ దొంగ మహిళ తెలివితేటలు మామూలుగా లేవుగా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.47 లక్షలకు పైగా లైక్‌లు, 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 11:22 AM