Share News

Monkey Funny Video: ఈ ఆడ కోతి ప్రేమ మామూలుగా లేదుగా.. ఏం చేసిందో చూస్తే అవాక్కవుతారు..

ABN , Publish Date - Jul 27 , 2025 | 09:47 AM

కంట్లో నలుసు పడడంతో మగ కోతి బాగా ఇబ్బంది పడింది. దాన్ని బయటకు తీయలేక, నొప్పితో విలవిల్లాడిపోయింది. ఇంతలో దూరంగా ఉన్న ఆడ కోతి ఇదంతా గమనించింది. వెంటనే పరుగు పరుగున అక్కడికి వచ్చింది.

Monkey Funny Video: ఈ ఆడ కోతి ప్రేమ మామూలుగా లేదుగా.. ఏం చేసిందో చూస్తే అవాక్కవుతారు..

కోతులు చేసే పనులు ఎంత విసుగు తెప్పిస్తాయో.. కొన్నిసార్లు అంతే స్థాయిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాగే కొన్ని కోతులు మనుషులను అనుకరిస్తూ చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి ఆశ్చర్యకర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మగ కోతికి కంటిలో నలుసు పడడం చూసి అడ కోతి చేసిన నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ప్రేమంటే ఇదేరా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కంట్లో నలుసు పడడంతో మగ కోతి బాగా ఇబ్బంది పడింది. దాన్ని బయటకు తీయలేక, నొప్పితో విలవిల్లాడిపోయింది. ఇంతలో దూరంగా ఉన్న ఆడ కోతి (Female Monkey) ఇదంతా గమనించింది. వెంటనే పరుగు పరుగున అక్కడికి వచ్చింది.


మగ కోతి బాధ చూసి తట్టుకోలేకపోయిన ఆడ కోతి.. కంట్లో నలుసు తీసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆ కోతి అచ్చం మనుషులు చేసినట్లుగానే చేసింది. ఎంతో తెలివిగా ఓ ఆకు తీసుకుని ఎంతో సున్నితంగా కంట్లోని నలుసుపై టచ్ చేస్తూ ఒకవైపునకు జరుపుతూ వచ్చింది. ఇలా కంట్లో నలుసు తీయడానికి చాలా సేపు ప్రయత్నించింది.


ఈ క్రమంలో కోతి ఎక్స్‌ప్రెషన్ దగ్గరి నుంచి అది చేసే పనులన్నీ అచ్చం మనుషుల్లాగానే ఉన్నాయి. దీంతో ఈ సీన్ చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ కోతి ప్రేమ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ప్రేమంటే ఇదేరా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3800కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 09:47 AM