Dog Viral Video: నీటిలో మునిగిపోతున్న స్నేహితుడిని.. ఈ కుక్క ఎలా కాపాడిందో చూస్తే..
ABN , Publish Date - Jul 27 , 2025 | 10:38 AM
ఏం జరిగిందో ఏమో గానీ.. ఓ కుక్క ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. దాన్నుంచి బయటికి రాలేక సతమతమవుతోంది. ఇంతలో అటుగా వచ్చిన ఓ కుక్క నీటిలో పడిపోయిన కుక్కను గమనించింది. వెంటనే దానికి సాయం చేసే పనిలోకి దిగింది. చివరకు దాన్ని కాపాడిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు..

కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో.. అంతే తెలివిగానూ వ్యవహరిస్తుంటాయి. చాలా ప్రమాదాలను ముందే గుర్తించడంతో పాటూ ప్రమాదాల్లో పడిపోయిన వారిని కాపాడడంలోనూ ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటాయి. ఈ క్రమంలో అవి చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీటిలో మునిగిపోయిన స్నేహితుడిని.. ఓ కుక్క కాపాడిన తీరు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో గానీ.. ఓ కుక్క ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. దాన్నుంచి బయటికి రాలేక సతమతమవుతోంది. ఇంతలో అటుగా వచ్చిన ఓ కుక్క నీటిలో పడిపోయిన కుక్కను గమనించింది. వెంటనే దానికి సాయం చేసే పనిలోకి దిగింది.
ఇంతలో ఆ కుక్కకు దూరంగా ఓ టైరు కనిపించింది. దాన్ని నోట కరుచుకుని అక్కడికి వచ్చింది. నీళ్ల గుంత పైన నిలబడిన కుక్క.. ఆ టైరును నీటిలోకి వదిలింది. నీటిలో ఉన్న కుక్క ఆ టైరును నోటితో పట్టుకుంటుంది. తర్వాత పైన ఉన్న కుక్క దాన్ని లాగేస్తుంది. అయితే మొదటి ప్రయత్నం విఫలమవుతుంది. అలాగే రెండో సారి కూడా లాగలేకపోతుంది. అయితే మూడోసారి ఎంతో బలంగా (Dog saves friend with tire) లాగి చివరకు కుక్కను పైకి లాగేస్తుంది.
ఇలా తన స్నేహితుడిని ఎంతో తెలివిగా టైరు సాయంతో ప్రమాదం నుంచి బయటపడేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ కుక్క తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘ఈ కుక్కను చూసి చాలా నేర్చుకోవాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 45 వేలకు పైగా లైక్‌లు, 2.2 మలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..
ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి