Share News

Fake Embassy Case: నకిలీ రాయబార కార్యాలయం కేసులో వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు.. రూ.300 కోట్లకు పైగా..

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:57 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో నకిలీ కార్యాలయం కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ.300 కోట్ల విలువైన కుంభకోణంతో సంబంధాలు ఉన్నట్లు తేలింది.

Fake Embassy Case: నకిలీ రాయబార కార్యాలయం కేసులో వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు.. రూ.300 కోట్లకు పైగా..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో నకిలీ కార్యాలయం కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ.300 కోట్ల విలువైన కుంభకోణంతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ కార్యాలయాన్ని నడిపే హర్షవర్ధన్ జైన్ పదేళ్లలో సుమారు 162 విదేశీ పర్యటనలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఘజియాబాద్‌లో రెండు అంతస్తుల లగ్జరీ భవనాన్ని 'వెస్టార్కిటికా' రాయబార కార్యాలయంగా నడుపుతున్న హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన ట్రావిస్ మెక్‌హెన్రీ అనే వ్యక్తి 2001లో వెస్టార్కిటికా అనే దేశాన్ని స్థాపించాడు. అయితే వెస్టార్కిటికాను ఏ దేశం గుర్తించలేదు. ఇలా ఉండగా హర్షవర్ధన్ ఈ దేశానికి బారన్‌గా పనిచేసుకుని ఘజియాబాద్‌లో రాయబార కార్యాలయం తెరిచాడు. విదేశాల్లో పని ఇప్పిస్తామంటూ యువకులను ఆకర్షించడానికి ఉద్యోగాల రాకెట్ నడుపుతున్నాడని విచాణలో తేలింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులతో మార్ఫింగ్ చేసిన ఫొటోలు పెట్టుకుని మోసం చేస్తున్నట్లు గుర్తించారు.


ఈ కేసు విచారణలో రోజుకో షాకింగ్ ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. హర్షవర్ధన్‌కు సుమారు రూ.300 కోట్ల కుంభకోణంలో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఇతడికి అంతర్జాతీయ హై ప్రొఫైల్స్‌ కలిగిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. అదేవిధంగా ఇతడికి దుబాయ్‌లో 6, మారిషస్‌లో ఒకటి, యూకేలో 3, భారత్‌లో ఒక బ్యాంకు అకౌంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నకిలీ రాయబార కార్యాలయాన్ని (fake embassy) 2017 నుంచి కొనసాగిస్తున్నట్లు తెలిసింది.


ఈ నకిలీ కార్యాలయంపై జరిపిన దాడిలో హర్షవర్ధన్ జైన్.. ‘ఆద్మీ’ చంద్రస్వామి, సౌదీ ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గితో ఉన్న ఫోటోలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన నేమిచంద్.. తనను తాను చంద్రస్వామిగా పేరు మార్చుకున్నారు. 80, 90లలో చంద్రస్వామి ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. మాజీ ప్రధానులు పీవి నరసింహరావు, చంద్రశేఖర్ లతో చంద్రస్వామికి అత్యంత సాన్నిహిత్యం ఉండేదని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పట్లో హర్షవర్ధన్ జైన్‌ను.. అహ్సాన్ అలీ సయీద్‌లకు పరిచయం చేసింది చంద్రస్వామే అని యూపీ ఎస్‌టీఎఫ్ అధికారులు చెబుతున్నారు. సయీద్, జైన్‌తో కలిసి మొత్తం 25 షెల్ కంపెనీలను తెరిచి, బ్లాక్ మనీని వైట్‌గా మార్చినట్లు గుర్తించారు.


ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 01:57 PM