Share News

Couples Viral: బయటపడిన భార్య లవ్ స్టోరీ.. చంపుతుందనే భయంతో భర్త ఏం చేశాడంటే..

ABN , Publish Date - Jul 30 , 2025 | 10:23 AM

ప్రియుడితో కలిసి భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భార్య.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సాంబారులో విషం పెట్టి చంపిన భార్య.. హనీమూన్‌కు తీసుకెళ్లి భర్తను హతమార్చిన భార్య.. ఇవీ ఇటీవల తరచూ వినిపించే వార్తలు. ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా దారుణంగా హతమారుస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో..

Couples Viral: బయటపడిన భార్య లవ్ స్టోరీ.. చంపుతుందనే భయంతో భర్త ఏం చేశాడంటే..

ప్రియుడితో కలిసి భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భార్య.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సాంబారులో విషం పెట్టి చంపిన భార్య.. హనీమూన్‌కు తీసుకెళ్లి భర్తను హతమార్చిన భార్య.. ఇవీ ఇటీవల తరచూ వినిపించే వార్తలు. ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా దారుణంగా హతమారుస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో కొందరు భర్తలు తెగ భయపడిపోతున్నారు. మరికొందరైతే.. ప్రియుడు ఉన్నాడని తెలిస్తే భార్యలను వారితో పంపడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి సంఘటనలు ఇటీవల చూస్తూనే ఉన్నాం. తాజాగా, తెలంగాణలో ఈ తరహా కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్యకు పెళ్లికి ముందే ప్రియుడు ఉన్నాడని తెలుసుకున్న భర్త.. చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన తెలంగాణ (Telangana) వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక గ్రామానికి చెందిన పావని, నాగేష్ (పేర్లు మార్చాం) అనే యువతీయువకులు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి పెళ్లికి రెండు కుటుంబాల వారూ అంగీకరించలేదు. ఈ క్రమంలో పావనిని కర్ణాటకకు చెందిన యువకుడితో వివాహం జరిపించారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చింది.


పెళ్లి అయిందని తెలిసినా కూడా నాగేష్.. పావనని మర్చిపోలేదు. తరచూ ఫోన్లు చేస్తూ (Boyfriend calling his girlfriend) విసిగిస్తూ ఉండేవాడు. అయితే కొన్నాళ్లకు ఈ విషయం భర్తకు తెలిసింది. భార్యకు పదే పదే ఫోన్లు రావడం చూసి విచారించగా మొత్తం విషయం తెలిసిపోయింది. ఇటీవల ప్రియుడితో కలిసి భర్తను చంపుతున్న భార్యల వార్తల నేపథ్యంలో పావని భర్త భయపడిపోయాడు. తనను కూడా చంపుతుందోమో అనే భయంతో పెద్దల సమక్షంలో (Husband leaves wife) పంచాయితీ పెట్టించి తెగదెంపులు చేసుకున్నాడు. తర్వాత పావని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.


అయితే అప్పటికీ ఆమెను వదలని ఆమె ప్రియుడు నాగేష్.. పదే పదే వెంటపడేవాడు. నీకు నేనున్నా.. బాగా చూసుకుంటాం.. అంటా మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆమెను కొన్నాళ్ల పాటు శారీరకంగా వాడుకున్నాడు. ఇటీవల పెళ్లి చేసుకోవాలంటూ పావని పట్టుబట్టడంతో సడన్‌గా దూరం పెట్టాడు. చివరకు మోసపోయానని గ్రహించిన పావని.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 30 , 2025 | 10:23 AM